పొరపాటున దీపికను ప్రియాంక అనుకుని... ఏం చేశారో చూడండి... | Foreign media fails to recognise Deepika Padukone yet again.

Foreign media address deepika padukone as priyanka chopra yet again

Deepika Padukone, Foreign Media Deepika Priyanka Chopra, Priyanka Chopra Deepika Padukone, Hello Priyanka to Deepika, Deepika Padukone as Priyanka Chopra, Hollywood Media Fail Deepika Padukone, Hello Priyanka Video, Actress Deepika Padukone

Deepika Padukone mistaken for Priyanka Chopra yet again, this time by photographers in LA.

హాలో ప్రియాంక.. ఫారిన్ మీడియా మళ్లీ మిస్టేక్

Posted: 03/07/2017 04:24 PM IST
Foreign media address deepika padukone as priyanka chopra yet again

బాలీవుడ్ నుంచి ఒకేసారి ఆ ఇద్దరూ బ్యూటీలు హాలీవుడ్ పై దండయాత్ర చేయటం మూలానో ఏమో అక్కడి మీడియాకు ఎవరెవరో తెలీకుండా పోతుంది. మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తూ నవ్వుల పాలు అవుతోంది. అయితే చిన్న చితకా వీడియోలు కూడా వైరల్ అవుతున్న ఈ రోజుల్లో ఏం విషయం దాచేస్తే దాగదు కదా. అందుకే ఆ వీడియో ఇప్పుడు తెగవైరల్ అవుతోంది.

రీసెంట్ గా తాను నటించిన ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయడానికి సొట్ట బుగ్గల సుందరి దీపికా పదుకునే అమెరికా వెళ్లింది. అక్కడ ఎయిర్ పోర్ట్ లో పీకూను చూసిన మీడియా వాళ్లు ఆమె వెంట పడ్డారు. అయితే పొరపాటున ఆమెను ప్రియాంక అని సంభోదిస్తూ ఫోటోల కోసం ఎగబడ్డారు. చివర్లో అయితే ఏకంగా ప్రియాంక.. వెల్ కమ్ బ్యాక్ అంటూ ఎగబడటం, అవేం పట్టించుకోకుండా దీపికా చక్కగా కారు ఎక్కి వెళ్లిపోవటం మనం చూడొచ్చు.

 

అయితే ఇదేం కొత్త వ్యవహారం కాదు. ట్రిపుల్ ఎక్స్ ప్రమోషన్ సమయంలో కూడా దీపికను ప్రియాంక అని సంభోదించగా, చికాకు పడిపోయి చివరికి తన పేరు దీపిక పదుకునే అంటూ కోపంగా చెప్పింది. హాలీవుడ్ లో దాదాపు ఈ ఇద్దరూ ఒకే టైంలో వార్తల్లో నానటం మూలానో ఏమో, ఈ భారతీయ సుందరిమణుల విషయంలో అక్కడి మీడియా ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika Padukone  Foreign Media  Priyanka Chopra  

Other Articles