బాహుబలికి వార్నింగ్.. రిలీజ్ అయితే థియేటర్లు తగలబెడతాడంట. అజిత్ సినిమానూ ఆపేశాడు | Baahubali Kannada Dubbing may not release.

Kannada senior actor jaggesh warn on dubbing movies

Kannada Actor Jaggesh, Jaggesh Dub Fight, Jaggesh Dubbing Movies, Jaggesh Ajith Kumar, Jaggesh Ajith Movie, Jaggesh Sathyadev IPS, Sathyadev IPS Kannada Movie, Baahubali Kannada Dub, Jaggesh Tweet, Jaggesh Baahubali, Yennai Arindhaal Kannada, Ajith Dub Movie Controversy

Senior Kannada actor Jaggesh has become a flagbearer of sorts for the anti-dubbing movement in Karnataka. He has reportedly threatened to set theatres on fire that screen the dubbed film. In a tweet, he appreciated pro-Kannada activists.

అజిత్ డబ్బింగ్ చిత్రంపై శాండల్ వుడ్ లో వివాదం

Posted: 03/04/2017 10:57 AM IST
Kannada senior actor jaggesh warn on dubbing movies

రాజమౌళి కళాఖండం బాహుబలి-2 కోసం సర్వం సిద్ధం అవుతోంది. తమిళ్,మళయాళం, హిందీ మరియు తెలుగుతోపాటు కన్నడలో కూడా రెండో పార్ట్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే తమ సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి డబ్బింగ్ సినిమాలను అక్కడ ఎప్పుడో బ్యాన్ చేశారు. అంటే స్ట్రెయిట్ లాంగ్వేజ్ లోనే ఏ చిత్రమైనా రిలీజ్ కావాలన్న మాట. కానీ, బాహుబలి విషయంలో మాత్రం ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేద్దామనుకుంటున్న ప్రయత్నం ఫలించేలా కనిపించటం లేదు.

ఇతర భాషల చిత్రాలను కన్నడంలోకి డబ్బింగ్ చేస్తే... సినీ ప్రేక్షకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని, థియేటర్లను కూడా తగలబెట్టే పరిస్థితి తలెత్తవచ్చని ప్రముఖ కన్నడ నటుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గేష్ ట్వీట్ చేశాడు. ఓ 150కి పైగా చిత్రాల్లో నటించిన ఈ నటుడు అజిత్ సినిమా గురించి ఈ వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ నటించిన ఎన్నై అరింధాల్(తెలుగులో ఎంతవాడు గానీ) ని కన్నడలో సత్యదేవ్ ఐపీఎస్ పేరుతో డబ్ చేస్తున్నారు. దీంతో మండిపడిన జగ్గేష్ ఆ చిత్రం రిలీజ్ కాకుండా అడ్డుకుంటున్నాడు.

జగ్గేష్ కు మధ్దతునిస్తూ కన్నడ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ కూడా కామెంట్లు చేశాడు. డబ్బింగ్ సినిమాల భూతానికి శాండల్ వుడ్ లో అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పాడు. ఈ నెల 6వ తేదీన కన్నడ సంఘాలు, సినిమా వర్గాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను కూడా ఆహ్వానించామని చెప్పారు. ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమ కష్టాల్లో ఉందని... డబ్బింగ్ సినిమాలకు అనుమతి ఇస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని తెలిపాడు. తమ వినతిని పెడచెవిన పెట్టి డబ్బింగ్ సినిమాలను ప్రదర్శిస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాడు. అయితే మరికొందరు డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. మిగతా భాషల్లో సినిమాలకు ఇక్కడా క్రేజ్ ఉందంటున్న వాళ్లు గత కొన్నేళ్లుగా కన్నడ చిత్ర పరిశ్రమ చాలా కోల్పోయిందని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Jaggesh  Kannada Dub Movies  Ajith Kumar  Sathyadev IPS  

Other Articles