సర్దార్ డిస్ట్రిబ్యూటర్ల లొల్లి.. నితిన్ కు అన్యాయం జరగదు కదా? | Nizam Sardaar Distributors on their loss.

Sardaar nizam distributors press meet

Sardaar Gabbar Singh Distributors, Nizam Sardaar Distributors, Katamarayudu Sardaar Distributors, Sardaar Distributors Katamarayudu, Katamarayudu Nizam Rights, Nithin Katamarayudu Sardaar Nizam Rights, Sardaar Distributors Nithin, Katamarayudu Rights Fraud, Pawan Kalyan Headache

After Sardaar Movie Krishna District Distributor Sampath now Nizam Distributors held a press meet few hours ago and expressed his anguish over the staff of Pawan Kalyan. It is known that power star Pawan Kalyan starrer Sardaar Gabbar Singh was a disaster at the box office and brought major losses to its distributors.

కాటమరాయుడికి సర్దార్ డిస్ట్రిబ్యూటర్ల సెగ

Posted: 03/02/2017 01:30 PM IST
Sardaar nizam distributors press meet

గతేడాది సమ్మర్ లో సర్దార్ గబ్బర్ సింగ్ తో ఆకట్టుకోలేకపోయిన పవన్ ఈసారి కాటమరాయుడితో పవర్ చూపించేందుకు సిద్ధమైపోతున్నాడు. అయితే సర్దార్ సమయంలో డిస్ట్రిబ్యూటర్ల విషయంలో జరిగిన అన్యాయం గురించి ఈ మధ్య కృష్ణా డిస్ట్రిబ్యూటర్ సంపత్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తనకు వాటిల్లిన నష్టం, పవన్ ఆఫీస్ లో జరుగుతున్న మోసం గురించి బయటపెట్టాడు. దీంతో పవన్ కు తెలీకుండా నిర్మాత శరత్ మరార్, మేనేజర్ శ్రీనివాస్ లు చేస్తున్న గోల్ మాల్ గుట్టు రట్టయ్యింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు నైజాం డిస్ట్రిబ్యూటర్ల వంతు వచ్చింది. తమకు ఏకంగా రూ. 8 కోట్ల నష్టం వాటిల్లిందని డిస్ట్రిబ్యూటర్లు దిలీప్ టాండన్, తరుణ్, డిస్ట్రిబ్యూటర్ల సంఘం ప్రతినిధులు సునీల్, ఉదయ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. కొందరు పంపిణీదారులకు మాత్రమే నష్ట పరిహారాన్ని చెల్లించిన నిర్మాతలు... తమకు మాత్రం చెల్లించడం లేదంటూ వారు వాపోతున్నారు.

Sardaar Nizam Distributors

ఏడాది నుంచి పవన్ ను కలిసి తమ ఆవేదనను తెలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నామని... కానీ, ఆ అవకాశం తమకు లభించడం లేదని వీరు కూడా చెప్పటం విశేషం. ఈ విషయం పవన్ దృష్టికి వెళితే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు. పవన్ తాజా చిత్రం 'కాటమరాయుడు' హక్కులను తక్కువ రేటుకే ఇచ్చి, నష్టాన్ని పూడుస్తామని చెప్పిన నిర్మాత శరత్ మరార్, పవన్ కల్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ లు... ఇప్పుడు రైట్స్ తమకు ఇవ్వకుండానే మరో డిస్ట్రిబ్యూటర్ కు అమ్మారంటూ వారు ఆరోపిస్తున్నారు. కాగా, కాటమరాయుడు హక్కులను ఏషియన్ పిల్మ్స్ వారితో కలిసి హీరో నితిన్ ఫ్యాన్సీ రేటుకు చేజిక్కుచుకున్న విషయం తెలిసిందే. మరి పవన్ అభిమానికి నొప్పి కలగకుండా ఈ వ్యవహారాన్ని ఎలా చక్కబెడతాడో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardaar Gabbar Singh Movie  Nizam Distributors  Press Meet  

Other Articles