బాహుబలి-2 ట్రైలర్.. గెట్ రెడీ | Baahubali 2 Trailer ready for release.

Cinematographer senthil about baahubali 2 trailer

Baahubali-2 Trailer, Cinematographer Senthil, Senthil Twitter, Senthil Baahubali 2, Baahubali 2 Trailer, Baahubali 2 Teaser, Baahubali The Conclusion Teaser, Rajamouli Baahubali 2 Trailer, Baahubali 2 Trailer Date

Cinematographer Senthil hints about Baahubali-2 Trailer. Tweeted a Photo with that work.

బాహుబలి ది కంక్లూజన్ ట్రైలర్ రెడీ

Posted: 03/02/2017 12:36 PM IST
Cinematographer senthil about baahubali 2 trailer

ఒక్క మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ యేడాది మోస్ట్ అవెయిటింగ్ మూవీగా ఉన్న బాహుబలి ది కంక్లూజన్ ప్రస్తుతం పనులను చకచకా జరుపుకుంటూ ఏప్రిల్ 28కి రిలీజ్ కు రెడీ అయిపోతుంది. ఇక ప్రభాస్ బర్త్ డే ముందు రోజు నుంచి ప్రారంభమైన ప్రమోషన్ ఇప్పుడు ఊపు అందుకుంది. ఆపై రానా లుక్కు, బాహుబలి-దేవసేన పోస్టర్, మొన్న శివరాత్రికి శివుడి గజతాండవం ఇలా ఒక్కో పోస్టర్ తో అంచనాలను మరింత పెంచేశాడు. 

ఇక ఇప్పుడు ట్రైలర్ గురించి ఓ కంక్లూజన్ కి వచ్చేశాడు జక్కన్న. ఈ చిత్రం ట్రైలర్ రెడీ అయిందని, ప్రస్తుతం దీన్ని తెరపై ఎలా ఉందన్న విషయాన్ని పరీక్షిస్తున్నామని చిత్రం సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అన్నపూర్ణా స్టూడియోస్ లో ట్రైలర్ తయారైందని చెబుతూ, దీన్ని పరీక్షిస్తున్న సమయంలో తీసిన ఓ ఫోటోను ట్విట్టర్ పేజీలో పోస్టు చేశాడు సెంథిల్.

 

ఈ సినిమాపై వర్క్ చేస్తున్నామని, సీవీ రావు, శివకుమార్ లతో కలసి తెరపై ఎలా కనిపిస్తుందన్న విషయాన్ని చూస్తున్నామని కామెంట్ పెట్టాడు. కాగా, ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో విజువల్ ఎఫెక్ట్స్ మూలంగానే డిలే జరిగిందని రాజమౌళి స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతలోనే  ట్రైలర్ రెడీ అయ్యిందన్న వార్త ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. మొదటి పార్ట్ సమయంలోలాగానే ముందు ఓ చిన్న టీజర్ ను వదిలిపై ఆపై ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali The Conclusion  Official Trailer  

Other Articles