కొడుకు కోసం మాస్టర్ ఫ్లాన్... ఎవరా స్టార్ దర్శకుడు? | Star Director for MS Raju's Son next movie.

Sumanth aswin in star director movie

Director Vijay Bhaskar, Vijay Bhaskar Sumanth Aswin, Sumanth Aswin Next, Sumanth Aswin New Movie, Sumanth Aswin 2017, Sumanth Aswin Veteran Director, MS Raju Re Entry, MS Raju Vijay Bhaskar, MS Raju Usha Parinayam Movie

Tollywood top producer MS Raju introduced his son Sumanth Aswin to Telugu audience with the 2012 released ‘Tuneega Tuneega’. Now, it is heard that MS Raju is planning to produce Sumanth’s next film and popular veteran director Vijay Bhaskar, who is a specialist in churning out slapstick comedy entertainers, is going to call shots.

స్టార్ డైరక్టర్ తో సుమంత్ అశ్విన్

Posted: 02/23/2017 01:10 PM IST
Sumanth aswin in star director movie

తెలుగులో ఒకానోక టైంలో భారీ బడ్జెట్ చిత్రాలతో టాప్ ప్రోడ్యూసర్ గా ఓ వెలుగు వెలిగిన ఎంఎస్ రాజు తర్వాత అంతే పెద్ద దెబ్బలు తగలటంతో కనిపించకుండా పోయాడు. చివరిసారిగా 2012లో తూనీగ తూనీగ అంటూ తనయుడిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఏకంగా మెగా ఫోన్ పట్టుకున్న ఈ పెద్దాయన మధ్యలో రమ్, రతి అంటూ కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ చిత్రాలేవీ సగం షూటింగ్ కూడా జరుపుకోలేకపోయాయి. దీంతో  తిరిగి మళ్లీ నిర్మాణ ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

ఈ మధ్య సరైన హిట్లు లేని సుమంత్ అశ్విన్ ను హీరోగా పెట్టి ఓ స్టార్ దర్శకుడితో సినిమా తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు కూడా. నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, జై చిరంజీవా చిత్రాల దర్శకుడు కే. విజయ్ భాస్కర్ డైరక్షన్ లో ఓ సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. మంచి కామెడీ ఎంటర్ టైనర్ లు అందించిన ఈ సీనియర్ దర్శకుడు చివరిసారిగా వెంకీ-రామ్ తో కలిసి బోల్ బచ్చన్ రీమేక్ ‘మసాలా’ తో డిజాస్టర్ అందించాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో మంచి కథతో రాబోతున్నట్లు సమాచారం.

Vijay Bhaskar Re Entry

ఉషా పరిణయం అన్న టైటిల్ పరిశీలనలో ఉండగా, త్వరలోనే షూటింగ్ ప్రారంభించి, ఈ యేడాది చివర్లో రిలీజ్ చేసేందుకు ఎంఎస్ రాజు ప్లాన్ వేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే మరో సీనియర్ దర్శకుడు వంశీతో లేడీస్ టైలర్ సీక్వెల్ లో సుమంత్ నటిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Usha Parinayam Movie  Sumanth Aswin  MS Raju  Vijay Bhaskar  

Other Articles