ఘాజీ గ్రాండ్ సక్సెస్.. ఎక్కడ దెబ్బ కొట్టింది? Rana Ghazi first day collections poor.

Rana ghazi first day collections

Ghazi First Day Collections, Ghazi Collections, Rana Ghazi Collections, Ghazi telugu states collections, Ghazi Hindi Collections, Ghazi Tamil Collections, Ghazi Reviews, Ghazi The Attack First day Collections, Ghazi Tamil Collections

Rana Daggubati's Ghazi First Day Collections poor even though got extraordinary reviews.

రానా ఘాజీ ఫస్ట్ డే కలెక్షన్లు

Posted: 02/18/2017 04:24 PM IST
Rana ghazi first day collections

చాలా కాలం తర్వాత ఓ సోలో సినిమాతో వచ్చిన దగ్గుబాటి రానా ఘాజీతో బాగానే ఆకట్టుకున్నాడు. నిన్న రిలీజ్ అయిన ఈ చిత్రంకు అన్ని భాషల్లో మంచి రివ్యూలే ఇచ్చారు. లీడ్ రోల్స్ నటన, బోర్ కొట్టించని డైరక్టర్ సంకల్ప్ రెడ్డి టేకింగ్, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఓవరాల్ గా సినిమా సూపర్ అనే మాట వినిపించాయి. అయితే ఎంత సక్సెస్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ లెక్కలే సినిమా విజయాన్ని తేలుస్తాయన్నది మరచిపోకూడదు.  రివ్యూ కోసం క్లిక్ చేయండి

మరి మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్న ఘాజీ ఫస్ట్ డే ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టిందో చూద్దాం. తమిళ్, హిందీ మరియు తెలుగు మొత్తం మూడు భాషల్లో రిలీజ్ అయిన ఘాజీ ఓవరాల్ గా 4 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ చెబుతున్నాడు. హిందీలో గత వారం విడుదలైన అక్షయ్ కుమార్ జాలీ ఎల్ ఎల్ బీ-2 హవా ఇంకా కొనసాగుతుంటం, పైగా నిన్న మరో రెండు చిత్రాలు రిలీజ్ కావటంతో ఘాజీ పై ప్రభావం చూపింది. దీంతో హిందీ వర్షన్ కేవలం కోటి దాకా మాత్రమే రాబట్టింది.

మరోవైపు సౌత్ లో తమిళ్, తెలుగులో ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ కావటంతో కాస్త బెటర్ గానే ఉన్నాయి. ఇక్కడ సుమారు 3 కోట్ల దాకా రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే మౌత్ టాక్ తో శని, ఆదివారాల్లో కలెక్షన్లు పెరగొచ్చనే అంచనా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఘాజీ కలెక్షన్లు...

నైజాం 56 లక్షలు
ఉత్తరాంధ్ర 17 లక్షలు
గుంటూరు 13 లక్షలు
కృష్ణ 13 లక్షలు
సీడెడ్ 10 లక్షలు
ఈస్ట్ 8 లక్షలు
వెస్ట్ 7 లక్షలు
నెల్లూరు 3 లక్షలు

ఓవరాల్ గా కోటి 27 లక్షలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ghazi  Ghazi The Attack  First Day Collections  

Other Articles