ఇస్రోకి కంగ్రాట్స్ కానీ... అమితాబ్ రాంగ్ ట్వీట్ | Big B congratulates ISRO But what is this picture?.

Amitabh bachchan s wrong tweet congratulating isro

Amitabh Bachchan Twitter Troll, Amitabh Bachchan ISRO, Amitabh Bachchan Trolled, Amitabh Bachchan Dance Abhishek, Amitabh Bachchan ISRO Tweet, Amithabh Bachchan Funny

Amitabh Bachchan wished ISRO for launching 104 satellites and got trolled. Big B posted, "CONGRATULATIONS .. !!! ISRO for the launch of 103 satellites from one PSLV .. a world record ! HOPE ONE DAY WE LAND ON MOON !" along with a picture of himself dancing with son Abhishek.

ఇస్రోపై అమితాబ్ ట్వీట్.. పంచులే పంచులు...

Posted: 02/16/2017 09:01 AM IST
Amitabh bachchan s wrong tweet congratulating isro

అంతరిక్షంలో అద్భుతానికి ఆవిష్కరిస్తూ ఇస్రో నిన్న(బుధవారం) 104 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా మన ఘనతపై అభినందనలు వెల్లివిరిశాయి. ఈ క్రమంలో మన సెలబ్రిటీలు కూడా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో అమితాబ్ చేసిన ఓ పోస్టుతో ఇరకాటంలో పడేసింది.

ఇస్రో సాధించిన ఘనత పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన, 'ఒకే ఒక్క పీఎస్‌ఎల్వీలో 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపించిన ఇస్రోకి కంగ్రాట్స్‌. ఇదో ప్రపంచ రికార్డ్‌. మనం చంద్రుడిపై దిగే రోజు వస్తుందని ఆశిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. అంతవరకు అంతా బాగానే ఉంది. ఈ ఘనత పట్ల ఆనందంతో తన కుమారుడితో కలిసి డాన్స్ చేస్తున్నట్టు ఆయన ఫోటోపెట్టారు.

అంతే ఆ దిగ్గజ నటుడు ఏ ఉద్దేశ్యంతో పెట్టాడో తెలీదుగానీ, ఆయనపై పలువురు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అయితే పీఎస్ఎల్వీ ఫోటో పెట్టాలి లేదా ఇస్రో ఫోటో పెట్టాలి అలా కాకుండా అభిషేక్ తో ఆయన ఫోటో పెట్టడమేంటని మండిపడ్డారు. 'ఎవరైనా అమితాబ్ ఇంటికి నెట్ కనెక్షన్ కట్ చేయించండి', 'సార్, అభిషేక్ కెరీర్ ను ఇస్రో కూడా గాడినపెట్టలేదు' ‘ముందు ఆద్య చేతి నుంచి మొబైల్ తీసుకోండి సార్’ అంటూ ఇలా సాగిపోతున్నాయి సెటైర్లు. సోషల్ మీడియాలో పోస్టులు ఒళ్లు దగ్గరపెట్టుకుని పెట్టాలి...లేకుంటే ఎంతటి వారికైనా ఇలాంటి తిప్పలు తప్పవన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh Bachchan  ISRO Tweet  Troll  

Other Articles