కంగనా అవుట్.. తమన్నా ఇన్.. సల్మాన్ తో తిరుగుళ్లు... | Tamanna replaces Kangana for Salman.

Tamanna world tour in salman khan team

Tamannaah Bhatia, Tamannaah Bhatia Salman Khan, Salman Khan World Tour, Salman Khan Team, Salman Khan Tamanna, Salman Khan About Tamanna, Tamanna Salman Khan, Tamannaah Salman Khan, Tamannaah Kangana Ranaut, Kangana Ranaut Salman Khan, Tamanna Foreign Tour

Salman Khan is gearing up to take Australia and New Zealand by storm with his Da-Bang tour in April which will see him teaming up with Bipasha Basu, Prabhudheva, Badshah, Sonakshi Sinha, Daisy Shah and Manish Paul. Now, sources has learnt, that the tour has beeen extended to Malaysia but his Rajjo won't be travelling with him any further and will be replaced by Tamannaah Bhatia.

సల్మాన్ కోసం కంగనా ప్లేస్ లో తమన్నా

Posted: 02/07/2017 12:24 PM IST
Tamanna world tour in salman khan team

చేతిలో బాహుబలి-2 లాంటి ప్రిస్టీజియస్ ప్రాజెక్టు తప్ప తెలుగులో అవకాశాలు లేకపోవటంతో తమన్నా దిగాలుగా ఉంది. ఆ మధ్య ఒకటి రెండు కోలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో పలకరించిన తిరస్కరించేశారు టాలీవుడ్ ప్రేక్షకులు. దీంతో ఐటెం సాంగ్ లైనా ఫర్వాలేదు అడ్జస్ట్ అయిపోతానంటూ నిర్మాత, దర్శకులకు హింట్ ఇచ్చేసింది.

ఇదిలా ఉంటే బాలీవుడ్ కండల వీరుడు త్వరలో ద-బాంగ్ విదేశీ పర్యటన నిర్వహించబోతున్నాడు. కంగనా రనౌత్, బిపాసా బసు, ప్రభుదేవా, సోనాక్షి సిన్హా, డైసీ షా, మనిష్ పౌత్, వీరంతా ఈ టూర్ లో ఉన్నారు. అయితే చివరి నిమిషంలో మలేషియా కూడా జత చేరటంతో మరీ లాంగ్ షెడ్యూల్ అయిపోతుండటంతో కంగనా డ్రాప్ అయ్యిందంట. దీంతో ఈ ప్లేస్ లోకి తమన్నా వచ్చి చేరింది. ఈ విషయాన్ని తమ్మూయే స్వయంగా అనౌన్స్ చేసింది.

బాలీవుడ్ టీంతో ఇదేనా తొలి విదేశీ పర్యటన. అది కూడా సల్మాన్ లాంటి స్టార్ హీరో నేతృత్వంలో వెళ్లటం చాలా ఆనందంగా ఉందంటూ తమ్మూ ప్రకటించింది. ఏప్రిల్ 14న మలేషియాలోని మైన్స్ కన్వెషన్ లో నిర్వహించబోయే గ్రాండ్ ఈవెంట్ లో తమన్నా ఆడిపాడనుందంట. ఆ సంగతి పక్కన బెడితే బాలీవుడ్ లోనే మరో క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamanna  Salman Khan  World Tour  

Other Articles