టూ మచ్... టాలీవుడ్ టూ బాలీవుడ్.. అది కూడా ఫ్లాప్ సినిమా కాపీనా? | Badrinath Ki Dulhaniya poster copied from Tollywood flop movie.

Badrinath ki dulhania poster copied from telugu film

Badrinath Ki Dulhania poster, Badrinath Ki Dulhania Garam, Badrinath Ki Dulhania Telugu Movie, Badrinath Ki Dulhania poster Copy, Badrinath Ki Dulhania poster Telugu Movie, Badrinath Ki Dulhaniya, Alia Movie Copy Telugu Movie, Bollywood Copy Tollywood Poster

Badrinath Ki Dulhania poster copied from Telugu Movie Garam.

అలియా కొత్త పోస్టర్ పై సెటైర్లు

Posted: 02/03/2017 05:39 PM IST
Badrinath ki dulhania poster copied from telugu film

రెగ్యులర్ మీడియా కంటే సోషల్ మీడియాలోనే ముందుగా ఫస్ట్ లుక్ లు రిలీజ్ చేస్తు త్వరత్వరగా వైరల్ చేసేస్తున్నారు. అయితే ఎగబడిపోయి చూసే జనాలు అభినందనలతోపాటు, వాటిలో ఏం వంకలు దొరుకుతాయా? ఎలా ట్రోల్ చేద్దామ్మా అన్న ఇంటెన్షన్ తోనే ఎక్కువ మంది చూస్తుంటారు. ఇక చిన్నది దొరికినా సరే చుక్కలు చూపిస్తుంటారు. రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా ఓ సినిమాకు ఇదే రీతిలో అనుభవం ఎదురయ్యింది.

వరుణ్ ధావన్-అలియా భట్ జంటగా బద్రినాథ్ కీ దుల్హానియా అనే ఓ సినిమా రాబోతుంది. మొన్న ఫస్ట్ లుక్, నిన్న సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. కెమిస్ట్రీ బాగా కుదిరిన హిట్ పెయిర్ కావటం, పైగా ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటం, 24 గంటల్లో మిలియన్ వ్యూవ్స్ రావటంతో చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి కూడా. ఇదిలా ఉంటే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఓ అట్టర్ ఫ్లాప్ సినిమా, అది కూడా తెలుగు సినిమాతో కంపేర్ చేయటమే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గతేడాది ఆది-అదాశర్మ జంటగా వచ్చిన గరమ్ సినిమా పోస్టర్ తో ఇది పోలి ఉండటమే కారణం. దీంతో రెండింటిని పక్కపక్కనే పెట్టి సోషల్ మీడియాలో తెగవైరల్ చేయగా, నేషనల్ మీడియా కూడా ఊప్స్... అంటూ కథనాలు రాసేసింది. దీనిపై గరమ్ మేకర్లు లైట్ తీసుకుంటున్నప్పటికీ, కామెంట్లు పడటం మాత్రం ఆగటం లేదు. ఇదిలా ఉంటే శశాంక్ కైతన్ దర్శకత్వం వహించిన బద్రీనాథ్ కీ దుల్మానియా హోలి సందర్భంగా మార్చి 10న విడుదల కానుంది.

Varun Alia Poster Garam

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  Badrinath Ki Dulhania  Garam Movie  Poster  Copy  

Other Articles