రామన్న కాస్త రాంబాబుగా మారిపోయాడు | Ungarala Rambabu First Look released.

Sunil ungarala rambabu first look out

Sunil Ungarala Rambabu, Ungarala Rambabu First Look, Ungarala Rambabu First Look Poster, Sunil as Ungarala Rambabu, Sunil New Movie First Look, Sunil 2017 Movies, Sunil Upcoming Movies, Ungarala Rambabu Hero, Ungarala Rambabu First Poster, Sunil Ungarala Rambabu, Tollywood Hero Sunil, Sunil New Movie, Sunil Kranti Madhav Movie

Hero Sunil new movie Ungarala Rambabu first look poster released.

సునీల్ కొత్త పోస్టర్ వచ్చేసింది

Posted: 02/03/2017 12:36 PM IST
Sunil ungarala rambabu first look out

దశాబ్దంపాటు తెలుగు తెరపై కామెడీతో కితకితలు పెట్టించిన సునీల్ తర్వాత పూర్తిస్థాయి హీరోగా మారిపోయాడు. అయితే మర్యాద రామన్న తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం సునీల్ ఖాతాలో లేదనే అనుకోవాలి. గతేడాది ముచ్చటగా మూడు చిత్రాలతో వచ్చినప్పటికీ మెప్పించలేకపోయాడు. కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే లాంటి చిత్రాలు వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోయాయి. దీంతో సునీల్ ఇప్పుడు గట్టి హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇదిలా ఉంటే ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రానీరోజు లాంటి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్ తో సునీల్ ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఉంగరాల రాంబాబు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్ర నిర్మాతలు.

పువ్వు, దానికి కళ్లజోడు, అందులో ఓ గ్లాస్ పై సునీల్, మరో గ్లాస్ పై మలయాళం బ్యూటీ మియా జార్జ్ ఉన్నారు. క్రియేటివిటి చూస్తుంటే క్రాంతి మాధవ్ మరో సున్నితమైన ప్రేమకథతోనే ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ కానుకగా ఉంగరాల రాంబాబు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ దర్శక్వంలో మలయాళం చిత్రం టూ కంట్రీస్‌ను రీమేక్ లో కూడా సునీల్ హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ungarala Rambabu  Sunil  First Look  

Other Articles