దాసరి హెల్త్, ఆల్ ఈజ్ వెల్... పవన్ పరామర్శ | Tollywood prays for Dasari’s recovery.

Dasari narayana rao on road to recovery

Dasari Narayana Rao, Dasari Narayana Rao Health Bulliten, Dasari Narayana Rao, Dasari Narayana Rao Health, Dasari Narayana Rao KIMS, Dasari Narayana Rao Recovery, Mohan Babu on Dasari Health, Pawan Meet Dasari, Pawan Visits Dasari in Hospital

KIMS Hospitals Released Dasari Narayana Rao Health Bulletin. Says Dasari respond on treatment.

మెరుగుపడుతున్న దాసరి ఆరోగ్యం

Posted: 02/01/2017 05:53 PM IST
Dasari narayana rao on road to recovery

టాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురిచేస్తూ తీవ్ర అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరాడు దర్శకరత్న ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ రావు. శ్వాసకోశ సమస్యలు, అటుపై కిడ్నీ ఇన్ ఫెక్షన్ అంటూ సస్పెన్స్ రేపిన వైద్యులు చికిత్స తర్వాత సాయంత్రానికి ఆయన చికిత్సకు స్పందిస్తున్నారంటూ ప్రకటించేశారు వైద్యులు. ఇక ఈరోజు మళ్లీ కాసేపటి క్రితం హెల్త్ గురించి బులిటెన్ విడుదల చేశారు కిమ్స్ వైద్యులు.

ప్రస్తుతం ఆయన చికిత్సకు బాగానే స్పందిస్తున్నరని, మరో 24 గంటల తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని ప్రకటించారు. ఈరోజు ఆయనకు డయాలసిస్ చేయాల్సిన అవసరం రాలేదని తెలిపారు. కాగా, ఆరోగ్యం కుదుటప‌డుతుంద‌ని సినీన‌టుడు మోహ‌న్‌బాబు ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఉద‌యం నుంచి తాను అక్క‌డే ఉన్నట్లు తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ మంచి మ‌న‌సుతో ఆయ‌న ఆరోగ్యం కోసం ప్రార్థించాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించాడు. ఆయ‌న ఆరోగ్యం బాగుండాల‌ని కోరుకుంటూ సాయినాథుడిని ప్రార్థించేందుకు తాను షిర్డీ వెళుతున్న‌ట్లు పేర్కొన్నారు.

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అనారోగ్యానికి గురయ్యారన్న వార్త బాధ కలిగించిందని ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపాడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత శరత్ మరార్ తో కలిసి కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన పవన్ కల్యాణ్ దాసరిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని కిమ్స్ వైద్యులు చెబుతున్నారని చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. దాస‌రి ఆరోగ్యంగా వ‌స్తే ఎన్నో కుటుంబాలు బాగుప‌డ‌తాయని తెలిపారు. ఆయ‌న నూరేళ్లు బాగుండాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు వ్యాఖ్యానించారు. ఇక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తోపాటు, పలువురు సినీ ప్రముఖులు ఈరోజు ఆస్పత్రికి వెళ్లి దాసరిని పరామర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari Narayana Rao  KIMS  Health Bulliten  

Other Articles