వోడాఫోన్ తో బిగ్ బీకి సమస్య ... మధ్యలో దూరిన జియో | Amitabh Bachchan burns Vodafone on Twitter.

Amitabh bachchan faces network issue with vodafone

Amithabh Bachchan Twitter, Amithabh Bachchan Vodafone, Amithabh Bachchan Jio, Amithabh Bachchan Network Issue, Amithabh Bachchan 2017, Amithabh Bachchan News

Big B Amithabh Bachchan tweeted About His Vodafone Network Issue. He Got An Unexpected Reply From Jio!. Reliance Jio offers to send SIM .But Immediately Issue Solved.

వోడాఫోన్ పై అమితాబ్ కంప్లైంట్.. జియో రీ ట్వీట్

Posted: 02/01/2017 10:03 AM IST
Amitabh bachchan faces network issue with vodafone

సాధారణ జనాల సమస్యల కంటే సెలబ్రిటీల విషయంలో వాటిని ఎక్కువగా ఎక్స్ పోజ్ చేసేందుకు మీడియా ముందుండటం, జనాలకు కూడా అంతే ఆసక్తితో దానిని ఎగబడి గమనిస్తుండటం తెలిసిందే. అయితే ఓ అగ్రనటుడికి ఎదురైన సమస్యలు, అది కాస్త ట్రెండింగ్ ఉన్న ఓ అంశంకు ముడిపడింది కావటంతో సోషల్ మీడియాలో హైలెట్ గా మారిపోయింది.

సెల్ ఫోన్ నెట్ వర్క్ సమస్యలు సాధారణంగా అంతా ఎదుర్కుంటున్నవే. బాలీవుడ్ బిగ్ బీ కూడా ఆ బాధితుడేనంట. తాను వాడుతున్న నెట్ వర్క్ సరిగ్గా పని చేయడం లేదంటూ ట్విట్టర్ లో ఓ ట్వీట్ వేశాడు. అంతే అదికాస్త తెగ వైరల్ అయిపోయింది. కారణం అనుకోని సమాధానం దానికి రావటమే. తాను వాడుతున్న నెట్ వర్క్ వోడాఫోన్ సేవలు సరిగ్గా లేవంటూ... వోడాఫోన్.. మాకు సమస్యలు ఉన్నాయి. మీ నెట్ వర్క్ నుంచి సందేశాలు వెళ్లటం లేదంటూ.. కాస్త వెటకారంగానే ఓ ట్వీట్ వేశాడు. వెంటనే జియో దీనికి స్పందిస్తూ... బచ్చన్ సార్ మీకు కావాలంటే జియో సిమ్ ను ఇంటికే పంపిస్తాం. మీ ఆధార్ ఫ్రూఫ్ సమర్పిస్తే చాలూ అంటూ రిప్లై ఇచ్చింది.

 

వెంటనే రంగంలోకి దిగిన వోడాఫోన్ మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ సమస్యను త్వరగతిన పరిష్కారం చేస్తామంటూ ఓ ట్వీట్ చేయగా, కాసేపటికే సమస్య పరిష్కారం అయ్యిందంటూ మరో ట్వీట్ వేశాడు. మొత్తానికి జియోకి మారకుండా త్వరగా ప్రాబ్లమ్ ను సాల్వ్ చేసి వోడాఫోన్ శభాష్ అనిపించుకుంది. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amithabh Bachchan  Vodafone  Jio  Tweets  

Other Articles