ఎన్టీఆర్ ప్లేస్ లోకి చిరంజీవి వచ్చేశాడు | Chiranjeevi Voice Over to Ghazi.

Star heroes voice over for ghazi

Ghazi Voice Over, Ghazi Telugu Movie, Ghazi Chiranjeevi, Suriya Ghazi, Ghazi The Attack, Rana Ghazi, Ghazi Movie, Ghazi Movie Voice Over, Ghazi The Attack Amithabh Bachchan

Chiranjeevi, Suriya Going to Lend their voice for the Telugu and Tamil versions of Rana Daggubati and Taapse Pannu starrer upcoming Telugu-Hindi bilingual war drama The Ghazi Attack. Their voices will be used to narrate some crucial part of the story. Both the actors are very excited to be part of the project,” said a source from the film’s unit.Bollywood Big – B Amitabh Bachchan has already lent his voice for the Hindi version which is titled “The Ghazi Attack”.

రానా సినిమా కోసం కదిలిన స్టార్లు

Posted: 01/28/2017 02:54 PM IST
Star heroes voice over for ghazi

ఓ సినిమా ప్రయోగాత్మకంగా తెరకెక్కిందంటే దానిపై పాజిటివ్ కంటే నెగటివ్ కామెంట్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమా విషయంలో ఈ భయాలు ఎక్కువగా ఉంటాయి. రానా తదుపరి చిత్రంగా 'ఘాజీ' విషయంలో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.

1971 పాక్ యుద్ధం.. జలాంతర్గామి నేపథ్యంలో సాగే ఘాజీ సినిమా తెలుగు, తమిళ, హిందీ బాషల్లో తెరకెక్కింది. చాలా గ్యాప్ తర్వాత రానా చేస్తున్న సోలో చిత్రం ఇదే కావటంతో చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమాకు సైన్ చేసిన సమయంలో రిస్క్ చేస్తున్నావంటూ చాలా మంది భయపెట్టారని, తనని ఓ పిచ్చోడిగా చూశారని రానా ఓపెన్ గానే చెప్పాడు. అయినప్పటికీ కథపై నమ్మకంతోనే తాను ఒప్పుకున్నానని తెలిపాడు. ఇక ఈ సినిమాకు అదనపు ఆకర్షణ మరోకటి జత కాబోతుంది. 

అక్కడక్కడా సన్నివేశాలకు బ్యాగ్రౌండ్ లో ఓ వాయిస్ ఓవర్ వినిపించనుందట. ఇందుకోసం వాయిస్ ఓవర్ కోసం స్టార్ హీరోలను అప్రోచ్ కాగా, అందుకు ముగ్గురు స్టార్ హీరోలు ఓకే చెప్పినట్లు సమాచారం. తెలుగు నుంచి ఇంతకు ముందు ఎన్టీఆర్ అని చెప్పుకున్నప్పటికీ, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఫైనలైజ్ అయినట్లు తెలుస్తోంది. ఇక కోలీవుడ్ నుంచి సూర్య, బాలీవుడ్ నుంచి ఏకంగా బిగ్ బీ అమితాబ్ అల్రెడీ తన వాయిస్ ను అరువిచ్చేశాడు కూడా. ఇక చిరు, సూర్యలతో త్వరలోనే వీరితో డబ్బింగ్ చేయించనున్నట్లు తెలుస్తోంది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ను పీవీపీ నిర్మించగా, ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కానుంది.బాలీవుడ్ లో కరణ్ జోహార్ దీనిని రిలీజ్ చేయబోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ghazi The Attack  Voice Over  Amithabh Bachchan  Chiranjeevi  Suriya  

Other Articles