రొమాంటిక్ సీన్లు తీస్తావా? అంటూ స్టార్ డైరక్టర్ పై దాడి | Top Indian filmmaker slapped beaten for love scenes.

Sanjay leela bhansali slapped and assaulted

Top Director, Sanjay Leela Bhansali, Sanjay Leela Bhansali Attack, Bhansali Slap Video, Bhansali Assault Video, Rajput Karni Sena Sanjay Leela Bhansali, Sanjay Leela Bhansali Bollywood, Padmavati Director Attack, Bollywood Support Bhansali, Bollywood Condemn Bhansali Attack

Top Director Sanjay Leela Bhansali attacked on the sets of Padmavati. Top Indian filmmaker slapped, beaten for love scenes Mr Bhansali is slapped, beaten and his hair is pulled by members of the Rajput Karni Sena, a right-wing Hindu group, who stormed the shoot at Jaigarh Fort. They shouted protests and alleged that the film has love scenes between Queen Padmini and ruler Alauddin Khilji, played by actors Deepika Padukone and Ranveer Singh.

డైరక్టర్ సంజయ్ లీలా బన్సాలీపై భౌతిక దాడి

Posted: 01/28/2017 10:32 AM IST
Sanjay leela bhansali slapped and assaulted

బాలీవుడ్ పరిశ్రమ మొత్తం ఆగ్రహాంతో ఊగిపోతోంది. దేశం అంతా గొప్ప దర్శకుడిగా మన్ననలు అందుకుంటున్న సంజయ్ లీలా బన్సాలీపై దాడిని ఖండిస్తూ బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ముక్తకంఠంతో పిలుపునిస్తోంది. యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యే ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

బాలీవుడ్ భారీ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సంజయ్‌ లీలా బన్సాలీపై భౌతిక దాడి జరిగింది. జైపూర్‌ లో 'పద్మావతి' సినిమా షూటింగ్ జరుగుతోంది. జైగఢ్ కోట వద్ద అల్లావుద్దీన్ ఖిల్జీ, రాణి పద్మావతి(రణ్ వీర్ సింగ్-దీపిక పదుకునే) ప్రేమాయణంలో చోటుచేసుకునే కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఆ సమయంలో షూటింగ్ స్పాట్ లోకి దూసుకొచ్చిన కొందరు దర్శకుడి చెంపలు వాయించి, ముఖంపై పిడిగుద్దులు గుద్దేశారు. హఠాత్తుగా జరిగిన పరిణామంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా బిత్తరపోయింది.



రాజ్ పుత్ కర్ని సేన సభ్యులే దాడి చేసినట్లు తెలుస్తోంది. రాణి పద్మావతిని చాలా హీనంగా చూపిస్తున్నాడని, అల్లావుద్దీన్ ఖిల్జీతో ప్రేమాయణం అంటూ లేనిపోనివి కల్పించి చరిత్రను వక్రీకరిస్తున్నాడంటూ సంజయ్ పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాలు తొలగించి, జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ దాడిని బాలీవుడ్ పెద్దలు తీవ్రంగా ఖండించారు. ఇది సంజయ్ కు మద్ధతుగా నిలావాల్సిన సమయం అంటూ కరణ్ జోహర్, మహేష్ భట్, ఫర్హాన్ అక్తర్ తదితరులు పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanjay Leela Bhansali  Atatck  Padmavati  Shooting  

Other Articles