మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా హీరోల మేకోవర్ మారటం సహజమే. ఎంతలా అంటే వాళ్ల స్టైలింగ్, డ్రెస్సింగ్ ను అభిమానులు గుడ్డిగా ఫాలో అయ్యేంతలా. అయితే ఈ మధ్య ట్రెండ్ మారిపోయింది. గత రెండేళ్లుగా పరిస్థితులను గమనిస్తే వాటి ప్రభావం ప్రేక్షకులపై అంతగా ఉండటం లేదనే చెప్పుకోవచ్చు. వాళ్ల స్టైలింగ్ అంత ఆకర్షణీయంగా లేకపోవటం ఓ కారణమైతే, సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలోని ఎప్పటికప్పటి అప్ డేట్స్ జనాలు ముందే తెలుసుకుంటున్నారు. దీంతో మళ్లీ ఆ ఊపును కొనసాగించేందుకు హీరోలు సిద్ధమైపోతున్నారు. అందుకోసం వాళ్లు ఎంచుకున్న ఒకే ఒక్క రూట్ గడ్డం.
అగ్రహీరోలతోసహా ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్ మొత్తం సరికొత్త స్టైలింగ్ కోసం తహతహలాడిపోతున్నారు. బాడీ లాంగ్వేజ్ దగ్గరి నుంచి డ్రెస్సింగ్ స్టైల్ దాకా వైవిధ్యతను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అగ్రహీరోలు బాలయ్య, నాగ్, వెంకీ, రీసెంట్ గా తిరిగి ఫాంలోకి వచ్చిన చిరు జనరేషన్ కి తగ్గట్లుగానే ట్రెండ్ ను ఫాలో అయిపోతున్నారు. ఇక పవన్, మహేష్ లది మాత్రం ఈ విషయంలో ప్రత్యేక శైలి. ఎంతలా అంటే వాళ్ల స్టైళ్లను ఫాలో కాపీ కొట్టడం అభిమానులను కాస్త కష్టమే.
మిగిలింది యంగ్ హీరోలు. వారిని ఓసారి పరిశీలిద్దాం. నాన్నకు ప్రేమతో లో సరికొత్త హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ తో ఆకట్టుకున్న ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లోనూ అదే స్టైల్ మెయింటెన్ చేశాడు. ఇక ఇప్పుడు తన కొత్త సినిమా కోసం బారెడు గడ్డంతో, కాస్త బొద్దుగానే కనిపిస్తున్నాడు. మెగా వవర్ స్టార్ రాంచరణ్ కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడు. ధృవ లో క్లీన్ షేవ్ తో పోలీసాఫీసర్ గా చెలరేగిపోయిన చెర్రీ నెక్స్ట్ సుకుమార్ తో
కమిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం అల్రెడీ గడ్డం పెంచేసి ఓ డిఫరెంట్ లుక్కులోకి మారిపోయాడు కూడా. త్వరలోనే(జనవరి 30) సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇదే రూట్ లో వెళ్తున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ దువ్వాడ జగన్నాథం కోసం గడ్డం రూపంలోనే కనిపించబోతున్నాడు. అదుర్స్ సినిమాలో చారి పాత్రలా బ్రహ్మణ యువకుడిగా నటించబోతున్నాడని తెలిసిందే. కొత్త లుక్ ను కనిపించకుండా బన్నీ తప్పించుకు తిరుగుతున్నా మెగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అది బయటపడింది.
మరో యంగ్ హీరో నితిన్ ది దాదాపు ఇదే రీతిలో ఉంది. అమాయకంగా కనిపించే నితిన్ ఇప్పుడు అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రాల దర్శకుడు హనురాఘవపూడితో ఓ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో పాత బస్తీ కుర్రాడిగా నితిన్ నటిస్తున్నాడు. ఇందుకోసం భారీగా గడ్డం పెంచేసి మాస్ లుక్కులో అదరగొట్టాడు.
చాక్లెట్ బాయ్ రామ్ ది కూడా ఇదే పరిస్థితి. నేను శైలజతో ఫామ్ లోకి వచ్చాడనుకుంటే.. వెంటనే హైపర్ తో పెద్ద దెబ్బ వేశాడు. దీంతో కథ విషయంలో కాస్త క్లారిటీ వచ్చాక కొత్త సినిమా మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. కరుణాకరన్ తో ఓ సినిమా కమిట్ అయినట్లు, అందుకోసమే బారెడ్ గడ్డంతో కొత్త లుక్కుతో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
Winter early mornings.. #love pic.twitter.com/9jjqdJWEx5
— Ram Pothineni (@ramsayz) January 4, 2017
వీళ్లే కాదు అల్రెడీ గడ్డంతో కమిట్ మెంట్ పెట్టుకున్న ప్రభాస్, రానాలు బాహుబలి-2లో అదే గెటప్ తో కనిపించనున్నారు. మరికొందరు యంగ్ హీరోలు కూడా ఇప్పుడు అదే పనిగా గడ్డం పెంచే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 2017 గడ్డం నామా సంవత్సరంగా వర్థిల్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more