లైవ్ షోలో యువతిపై అసభ్య ప్రవర్తన.. ఆ సింగర్ ఏం చేశాడంటే... | Atif Aslam stops concert to save girl from molestation.

Singer atif aslam stops concert mid way to rescue girl

Atif Aslam, Pakistan Singer, Rescue Girl, molestation, Atif Aslam Stops Concert, Atif Aslam molestation, Atif Aslam rescue, Atif Aslam news, singer Atif Aslam

Pakistan Singer Atif Aslam stops mid-concert to rescue girl from eve-teasing.

ఆ సింగర్ ఈవ్ టీజర్లను ఎలా ఉతికేశాడంటే...

Posted: 01/16/2017 03:38 PM IST
Singer atif aslam stops concert mid way to rescue girl

పాక్ కళాకారులపై బ్యాన్ వేసిన సమయంలో అంతా కిక్కురుమనకుండా ఉంటే, తనకు మాత్రం మతభేదాలు లేవని, ఛాన్సు ఇస్తే బాలీవుడ్ లో తన గాత్రంతో శ్రోతలను అలరిస్తానని ఓపెన్ గా ప్రకటించాడు సింగర్ అతిఫ్ అస్లామ్. అయితే తన గాత్రంతోనే, వ్యక్తిత్వంతోనూ ఇతగాడు రియల్‌ హీరోగా మారిపోయాడు. ఎలాగంటారా? ఈవ్‌ టీజర్స్‌ నుండి ఓ అమ్మాయిని రక్షించి...

ఈ మధ్య ఓ షోలో పాల్గొన్న అతిఫ్‌, తన పాటతో శ్రోతలను అలరిస్తున్నాడు. ఇంతలో ముందు వరుసులో నిల్చున్న ఒక అమ్మాయిని కొందరు ఏడిపించడం చూశాడంట. వెంటనే పాడుతున్న పాటను మధ్యలో ఆపేసి వారి దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయిని పైకి లాగాడు. తన సిబ్బంది సాయంతో ఆ యువతిని తన ఇంటి వద్ద దించి రమ్మని పురమాయించాడంట. అంతేకాదు కాసేపు తన షోని నిలిపివేసి అక్కడి యూత్ కి క్లాస్ కూడా పీకాడంట.

 

“మీకు అమ్మ, అక్కను లేరా, వాళ్లు కూడా ఇక్కడ ఉంటే ఏం చేసేవాళ్లు” అంటూ ఈవ్‌టీజర్స్‌ను దుమ్ముదులిపాడట ఈ సింగర్‌. అక్కడ షోను చిత్రీకరిస్తున్న వీడియోలో రికార్డ్‌ అవ్వగా, ఇప్పుడు అది సోషల్‌మీడియాలో హల్‌చల్‌ అవుతుంది. అన్నట్లు సింగర్‌ ఇండియాలో రీసెంట్‌గా ఒక ఆల్బమ్‌ను కూడా చేశాడు. ప్రముఖ నటి ఇలియానాతో కలిసి అతిఫ్‌ ‘పెహ్లీ దఫా’ అనే ఆల్బమ్‌లో నటించాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pak singer  Atif Aslam  Rescue  Molestation  Video  

Other Articles