గుణ లెటర్ తో వివాదం మరింత ముదురుతోందా? | Director Gunasekhar Humble Rant On CBN

Gunasekhar open letter to ap cm chandrababu naidu

Director Gunasekhar, AP CM Chandrababu Naidu, Gautamiputra Satakarni, Satakarni tax exemption, Gunasekhar open letter , Gunasekhar Chandrababu Naidu, Rudrama devi tax exemption, Guna sekhar AP government, Satakarni tax exemption

Director Gunasekhar asks AP CM chandrababu Naidu about entertainment tax on Gautamiputra Satakarni, asking him why his film didn’t get the similar benefit when it fits the same requirements as Gautamiputra Satakarni.

శాతకర్ణి సంగతి సరే... రుద్రమదేవి మ్యాటరేంటి?

Posted: 01/11/2017 09:47 AM IST
Gunasekhar open letter to ap cm chandrababu naidu

నటసింహ బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి.. ఈ నెల 12న థియేటర్లలోకి వస్తోంది. చారిత్రక కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను నుంచి మినహాయింపును ఇచ్చాయి. మొదట తెలంగాణ ప్రభుత్వం.. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం కూడా ఈ ట్యాక్స్ నుంచి రాయితీ కల్పించాయి. అయితే ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఏపీలో సొంత ప్రభుత్వం కావటంతోనే మినహాయింపు పొందారన్న విమర్శలు వినిపస్తుంటే, ఇక్కడ కాంగ్రెస్ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి ఆంధ్రా మేకర్ల సినిమాలకు రాయితీలు ఇస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది.

ఇది చాలదన్నట్లు గతేడాది తాను రూపొందంచిన రుద్రమదేవి చిత్రానికి వినోదపు పన్ను నుంచి మినహాయింపు కోరిన విషయాన్ని గుర్తు చేశాడు దర్శక నిర్మాత గుణ శేఖర్. '13వ శతాబ్దంలో స్త్రీ సాధికారితను చాటిన మహిళ గురించిన చారిత్రక చిత్రానికి పన్ను మినహాయింపు కోరాను. ఈ ఆదర్శవంతమైన కథకు.. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి పన్ను మినహాయింపు ఇచ్చింది. అయితే.. ఏపీ అధికారులు మాత్రం.. నా అభ్యర్ధనను మన్నించలేదు. తాజాగా మీరు కూడా రుద్రమదేవి దక్షిణాదికే ఖ్యాతిని ఆపాదించిందని చెప్పారు' అంటూ అందులో పేర్కొన్నాడు గుణ.

Gunasekhar letter chandrababu

 

అప్పటి నా దరఖాస్తును తిరిగి పరిశీలించి.. రుద్రమదేవి చిత్రానికి ఏపీలో వసూలు చేసిన వినోదపు పన్ను మొత్తానికి సరిసమానంగా ప్రోత్సాహక నగదును తనకు ఇప్పిస్తే.. ప్రభుత్వం నిష్పక్షపాతంగా పని చేస్తోందని అందరూ భావిస్తారంటూ పేర్కొన్నాడు. మరి ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో! చూడాలి. మరోవైపు శాతకర్ణి టాక్స్ మినహాయింపుపై లంచ్ పిటిషన్ దాఖలు చేసేందుకు హైకోర్టు న్యాయవాది ఆదర్శ్ కుమార్ సిద్ధమయ్యాడు. బుధవారం మధ్యాహ్నం అది బెంచ్ ముందుకు రానుంది.

 

చిరు ఏమన్నాడు...

'గౌతమీపుత్ర శాతకర్ణి'కి ఏపీ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడంపై చిరంజీవి కీలక వ్యాఖ్య చేశారు. 2015లో విడుదలైన గుణశేఖర్ చిత్రం 'రుద్రమదేవి'కి తెలంగాణలో పన్ను మినహాయింపు ఇచ్చినప్పటికీ, ఏపీలో ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ, "ఆ సినిమాకు ఇచ్చి, ఇప్పుడు ఈ చిత్రానికీ ఇచ్చి వుంటే, ఓహో... ఇలాంటి సినిమాలు తీస్తే ప్రోత్సాహకాలు లభిస్తాయని అనుకోవచ్చు. దానికి ఇవ్వకపోవడం, దీనికి ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది" అని అన్నారు. గత చరిత్రను చూపే సినిమాలకు రాయితీలు మంచిదేనని, 'రుద్రమదేవి'కి కూడా రాయితీలు ఇచ్చుంటే బాగుండేదని, ఇప్పుడు బాలయ్య సినిమాకు మాత్రమే రాయితీ ఇవ్వడమేంటని ఆయన అడిగారు. 'రుద్రమదేవి' సైతం చరిత్రకు సంబంధించిన సినిమానేనని గుర్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautamiputra Satakarni  Tax exemption  Gunasekhar  letter  chandrababu  Rudramadevi request  

Other Articles