ఎన్టీఆర్ సినిమా కెరీర్ ను నాశనం చేసింది- నవదీప్ | Jr NTR movie spoil young hero carrier.

Acting in baadshah is my mistake says navdeep

Actor navadeep, Jr NTR, Baadshah Movie, Navadeep Baadshah, Baadshah is my mistake, Navadeep carrier mistake, Navadeep negative role, Navdeep Regrets

Navdeep Regrets Doing Jr NTR's Baadshah Movie.

బాద్ షా సినిమా చేయటం నా తప్పే!

Posted: 01/10/2017 08:46 AM IST
Acting in baadshah is my mistake says navdeep

హీరోగా చేస్తున్న సమయంలోనే ట్రాక్ తప్పి నెగటివ్ రోల్స్ వైపు మళ్లాడు నవదీప్. తేజ ‘జై’ సినిమా ద్వారా హీరోగా పరిచయి గౌతమ్ ఎస్ఎస్ సీ తో ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాతే అతను తీసుకున్న నిర్ణయం కొంప ముంచిందని ఇప్పుడు తెగ ఫీలయిపోతున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు ఈ యంగ్ నటుడు.

హీరోగా రాణిస్తున్న సమయంలోనే ఆర్య-2 లో నెగటివ్ ఛాయలు ఉన్న రోల్ చేశా. అయితే అది తనకు మంచి గుర్తింపే తెచ్చి పెట్టింది. కానీ, ఇప్పటికీ అదే తరహా పాత్రలు రావటానికి కారణం మాత్రం ఎన్టీఆర్ బాద్ షానే. అందులో పూర్తి విలన్ పాత్ర చేశా. బాద్ షా కారణంగానే చాలా మంచి అవకాశాలను మిస్ చేసుకోవాల్సి వచ్చింది. అందులో నటించి తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తోందంటూ వ్యాఖ్యలు చేశాడు. అయితే మళ్లీ ఇన్నాళ్లకు చెర్రీ రిక్వెస్ట్ మేరకు ధృవలో ఓ మంచి పాత్రను పోషించగలిగానని, అది తనకు మంచి పేరు తెచ్చిందని అంటున్నాడు.

మరోవైపు నవదీప్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. బాద్ షా యావరేజ్ టాక్ దక్కించుకుంది కానీ, ఒకవేళ బ్లాక్ బస్టర్ అయి ఉంటే నవదీప్ ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాడేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మధ్యలో కూడా ఈ యంగ్ నటుడు సోలో హీరోగా చాలా సినిమాలే చేశాడని, అవేవీ హిట్లు కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Navdeep  Regrets  Baadshah movie  negative role  mistake  

Other Articles