సెక్స్ లైఫ్, షారూఖ్ గే రిలేషన్ పై ఓపెన్ అయ్యాడు | Karan opens up about his sexual orientation like never before.

Karan finally opens up on rumoured sexual relationship with srk

An Unsuitable Boy, Karan Johar, Shah Rukh Khan, Karan SRK relation, Karan Johar Biography, An Unsuitable Boy book, SRK An Unsuitable Boy, Karan Johar homosexuality, Karan Johar biography

Karan Johar breaks his silence on rumours about his relationship with Shah Rukh Khan in his his biography An Unsuitable Boy.

సెక్స్ లైఫ్ గురించి కరణ్ ఏం చెప్పాడు?

Posted: 01/09/2017 06:25 PM IST
Karan finally opens up on rumoured sexual relationship with srk

బాలీవుడ్‌ టాప్ మేకర్ కరణ్ జోహర్ టీవీ షోలలో ఎంత ఓపెన్ గా మాట్లాడుతుంటాడో చూస్తున్నదే! సెక్స్ గురించి తన షోకి వచ్చే సెలబ్రిటీలతో ఖచ్ఛితంగా డిస్కష్ చేసే కరణ్ కి హోమో సెక్సువాలిటీకి సంబంధించిన సంగతులు ఏవైనా రాగానే ముఖంలో ఓ వెలుగు కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది తన జీవిత చరిత్రలో షాకింగ్ విషయాలు చెప్పకుండా ఉంటాడా? త్వరలో ‘ద అన్‌సూటబుల్‌ బాయ్‌’ పేరుతో అతని ఆత్మకథ విడుదల కానుంది. అయితే రిలీజ్ కు ముందే అందులోని కొన్ని విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

సెక్సు, సెక్సు ధోరణి గురించి, షారుక్‌ ఖాన్‌, తన మధ్య సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లపై కరన్‌ జోహర్‌ ఈ బుక్ లో స్పందించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ జాతీయ పత్రిక కథనంలో అందులోని సంగతులు కులంకశంగా వివరించాడంట. ‘‘ సెక్స్‌ గురించి నిర్మోహమాటంగా మాట్లాడితే జైల్లో పెట్టే దేశంలో ఉన్నాను. అందుకే ఆ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడను. షారూక్‌ ఖాన్‌ మీదా తన మీద ఏన్నో వదంతులు వ్యాపించాయన్నారు. ‘‘ఓ హిందీ టీవీ ఛానల్‌‌లో ఇంటర్‌వ్యూ చేస్తున్న వ్యక్తి నా గురించి, షారూక్‌ గురించి మాట్లాడుతూ ‘మీది అనూహ్యమైన బంధం’ అని వ్యాఖ్యానించాడు. నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే ‘నీవు నీ సోదరుడితో పడుకుంటున్నావు’ అని నేను అంటే నీకు ఏమనిపిస్తుంది అని ప్రశ్నించాను. దానికి అతడు.. ‘ఏమనుకుంటున్నారు. ఇటువంటి ప్రశ్నను ఎలా అడుగుతున్నారు’ అని అన్నాడు. అప్పుడు నేను ‘అయితే, మీరు నన్ను అటువంటి ప్రశ్నను ఎలా అడుగుతారు’ అని అన్నాను’’ అని కరణ్ తెలిపాడు.

షారుక్‌ తన పిల్లలకు ఓ మంచి తండ్రి, అంతేకాదు తనకు ఓ బ్రదర్ లాంటివాడు.ఆ వదంతులను షారుక్‌ పట్టించుకోలేదని, జనం నోటికేదొస్తే అది మాట్లాడతారని, వివాహేతర సంబంధాలు లేకపోతే స్వలింగసంపర్కుడిగా ముద్రవేస్తారన్నారు. ‘‘ఇంతకు ముందు ఎప్పుడూ నేను సెక్స్‌ గురించి మాట్లాడలేదు. నేను హెటెరోసెక్సువల్‌నా, హోమో సెక్సువల్‌నా, బైసెక్సువల్‌నా అన్నది నా వ్యక్తి గతమైన విషయం. నా సెక్స్‌ జీవితం గురించి చాలా జోకులు వేస్తుంటారు. హోమోసెక్సువాలిటీకి ఓ పోస్టర్‌ బాయ్‌గా మారిపోయాను. దీని గురించి నేను బాధపడడం లేదు. ట్విటర్‌‌లో నాపై చాలా నీచంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. ప్రతి రోజూ నేను లేచిన వెంటనే దాదాపు 200 ద్వేషపూరితమైన పోస్టులు దర్శనమిస్తాయి. ఈ విషయం గురించి గట్టిగా ఎందుకు మాట్లాడవని నన్ను అడుగుతుంటారు. నా మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. నాకోసం పని చేసే వారికి నేను సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాంటిది అనవసరమైన విషయాల్లో స్పందించి వివాదాల్లో చిక్కుకోవాలని నేను అనుకోవటం లేదు అని కరణ్ అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కరణ్ ఆత్మకథ లో ఇంకా బోల్డెంత ఆసక్తి విషయాలు ఉండబోతున్నాయని ఈ శాంపిల్ ద్వారా అర్థమౌతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karan Johar  biography  An Unsuitable Boy  

Other Articles