బర్త్ డే స్పెషల్: మ్యూజిక్ మొజార్త్@50 | AR Rahman celebrates his 50th birthday.

A r rahman birthday special

A.R Rahman, Rahman birthday special, rahman birthday, Mozart of Madras, A.R Rahman 50 years, A.R Rahman birthday tweets, Rahman celebrates birthday, Oscar winner Rahman, Rahman Jai Ho

India's most decorated musician A.R Rahman turns 50.

స్పెషల్: ఏఆర్ రెహమాన్ @50

Posted: 01/06/2017 11:02 AM IST
A r rahman birthday special

దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ నేడు 50వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. దేశం గర్వించదగ్గ ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలను అందించటమేకాదు, అత్యున్నతమైన ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడిగా రికార్డు సృష్టించిన రెహమాన్ లెజెండరీ కెరీర్ గురించి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.


- రెహమాన్ అసలు పేరు ఎ.ఎస్. దిలీప్ కుమార్. ఆర్ కే శేఖర్, కస్తూరి(కరీమా) దంపతులకు 1967 జనవరి 6న చెన్నైలో జన్మించాడు. పుట్టింది కడు పేద కుటుంబంలో, పైగా తొమ్మిదేళ్ళ ప్రాయంలో తండ్రిని పొగొట్టుకున్నాడు. సంగీత వాయిద్యాలను అద్దెకిచ్చి వచ్చిన ఆ డబ్బుతో తల్లి.. ముగ్గురు అక్కా చెల్లెళ్ళను పోషించాడు. ఆపై 11 ఏళ్ల ప్రాయంలో టార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా ట్రూప్‌లో సంగీత జీవితం ప్రారంభించాడు. 1989వ సంవత్సరంలో కుటుంబమంతా మతం మార్చేసుకుంది. భార్య సైరా బాను, ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమ్‌, అమన్‌. కొడుకు అమన్ కూడా అప్పుడే సింగింగ్ రంగంలోకి ఎంటర్ అయిపోయాడు.

- కెరీర్ పరంగానే కాదు, వ్యక్తిగతంగానూ రెహమాన్ కు తెలుగు నేలతో ప్రత్యేక అనుబంధం ఉంది. కడప లోని పెద్ద దర్గా, కసుమూరు దర్గా, నెల్లూరు జిల్లాలోని వేనాడు దర్గాలను తరచూ సందర్శిస్తూ ఉంటారు..

- రెహమాన్(13) తొలుత తెలుగు చలన చిత్రరంగం నుంచే తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తొలి రోజుల్లో కీబోర్డ్ ప్లేయర్ గా జంథ్యాల గారి ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాకు పనిచేశాడు. ఆపై కోటి దగ్గర సహయకుడిగా కొన్నాళ్లూ చేశాడు. కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చి, తదనంతరం మలయాళ దర్శకద్వయం సంతోష్-శివన్ ల దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకునిగా నటించిన 'యోధ' సినిమాతో పరిచయం అయ్యాడు.

- దర్శకుడితో మణిరత్నంతో స్నేహం ఆయన జీవితాన్నే మార్చివేసింది. ‘చిన్ని చిన్ని ఆశ’ అంటూ రోజా సినిమాతో తన జర్నీ ని స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రపంచం అంతా గుర్తించేస్థాయికి ఎదిగిపోయాడు. దిల్ సే బాలీవుడ్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.

 

- సంగీత ప్రపంచంలో రెహమాన్ ఇప్పుడు ఒక సంచలనం. సాంప్రదాయ, పాశ్చాత్య బాణీలను రంగరించి అన్ని వర్గాల వారిని కట్టి పడేసిన దర్శకుడు. కర్నాటక సంగీతాన్ని, ఖవ్వాలీ సంప్రద్రాయాన్ని, రెగే, హిప్-హాప్, ర్యాప్, రాక్, పాప్, జాజ్, ఒపెరా, సూఫీ ఆఫ్రికన్, అరేబియన్, పాశ్చాత్య సంగీతాన్ని శ్రావ్యంగా మిళితం చేయగలిగాడు రెహ్మాన్. అలా చేస్తూ కూడా పూర్తి స్థాయి ఒరిజినల్ బాణీలను తయారుచేశాడు.

- "స్లమ్‌డాగ్ మిలియనీర్" అనే చిత్రంలో 'జయహో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్టాత్మకమైన "గోల్డెన్ గ్లోబ్ అవార్డు"ను కైవసం చేసుకున్న రెహమాన్ ఈ గౌరవం తనకు మాత్రమే దక్కలేదని, వంద కోట్ల భారతీయులందరికీ లభించిన అరుదైన గౌరవం అన్నారు. నిజానికి ఈ పాటను సల్మాన్ నటించిన యువరాజ్ సినిమా కోసం గుల్జార్ రాశాడు. కానీ, అది అక్కడ కుదరకపోవటంతో రెహమాన్ కు నిజంగా కలిసొచ్చింది.
- నమ్ముకున్న వృతి పట్ల దీక్ష ,క్రమశిక్షణ, అందరికంటే ప్రత్యేకంగా ఉండాలన్నపట్టుదల, రెహమాన్ ను ఉన్నత శిఖరాలకు చేర్చింది. వందేమాతరం అంటూ రెహమాన్ సమకూర్చిన ప్రత్యేక బాణి ప్రపంచాన్ని ఆకట్టుకుంది.

- సంగీతావనికి ఆయన చేసిన కృషిని గుర్తించిన టైమ్ మ్యాగజైన్' రెహ్మాన్‌ కు "మొజార్త్ ఆఫ్ మద్రాస్" బిరుదు ఇచ్చింది. ఆయన పాటలు ఆస్కార్ కు నామినేట్ అయ్యాయి. "స్లమ్‌డాగ్ మిలియనీర్" అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్టాత్మకమైన "గోల్డెన్ గ్లోబ్ అవార్డు", రెండు ఆస్కార్ అవార్డులను అందుకొన్న తొలి భారతీయుడు. జాతీయ స్థాయి లో నాలుగుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా హిందీ, తమిళ చిత్రాలకు 19 సార్లు ఫిలిమ్‌ఫేర్‌ అవార్డులను, తమిళ ప్రభుత్వ అవార్డులను అందుకున్నాడు. 2010లో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ తో సత్కరించింది.

- ఈ లివింగ్ లెజెండ్ ప్రభావానికి తనుకూడా లోనుకాక తప్పలేదని తనకు రెహ్మాన్ అంటే భయమనీ, అసూయ అని ప్రఖ్యాత స్వరకర్త 'ఎస్ ఎల్ వైద్యనాథన్' అన్నాడు. రెహ్మాన్‌లా తను కూడా వేర్వేరు ప్లేన్స్‌లో, లేయర్స్‌లో, సకాలంలో వచ్చేకౌంటర్స్‌తో బాణీలు కట్టాలని ప్రయత్నించి చాలా సార్లు విఫలమైనానని ఒప్పుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు.

భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత రెహ్మాన్‌కే దక్కుతుంది. ఎప్పటికి భారతీయుల హృదయాలలో చెరగని ముద్ర వేసింన రెహమాన్ సంగీత ప్రపంచంలో దేదీవ్యమానంగా వెలగాలని కోరుకుంటూ తెలుగు విశేష్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Music Director  AR Rahman  Birthday special  

Other Articles