ప్రీ రిలీజ్ వేడుక.. వివాదంపై చిరుయే మాట్లాడతాడా? | Chiru may speak about Khaidi pre release event controversy.

Khaidi no 150 pre release event works speed up

Khaidi No 150, Khaidi No 150 pre release event, Pawan miss Khaidi pre release, Allu Aravind Pawan Kalyan, Khaidi No 150 Pre release function, Khaidi pre release business, Khaidi No 150 Janatha garage records, Khaidi no 150 release date

Khaidi No 150 pre-release event works speed up. Allu Aravind clarify Pawan Kalyan not attend to mega event.

ఖైదీ ప్రీరిలీజ్ వేడుకకు చకచకా పనులు

Posted: 01/03/2017 03:18 PM IST
Khaidi no 150 pre release event works speed up

అనుమతులు లభించలేదన్న వివాదాన్ని పక్కన బెట్టి చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ కు వేడుకలు జరిగిపోతున్నాయి. గుంటూరులోని హాయ్ ల్యాండ్ లో ఈ నెల 7న సాయంత్రం అట్టహాసంగా జరగనుంది. పదేళ్ల తర్వాత చిరు వెండితెరపై మెరవటంతో ఈ మెగా వేడుకకు బాస్ ఈజ్ బ్యాక్ గ్రాండ్ ఈవెంట్ అంటూ నామకరణం కూడా చేసుకున్నారు అభిమానులు. ఈ ఫంక్షన్ కు మెగా హీరోలంతా తరలిరానున్నట్లు ముందుగా చెప్పుకున్నారు. దీంతో పవన్ కూడా వేడుకలో సందడి చేయనున్నాడని అంతా అనుకున్నారు. అయితే ప్రీరిలీజ్ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ దానిపై క్లారిటీ ఇచ్చాడు.

'ఖైదీ' వేడుకకు పవన్ కల్యాణ్ హాజరు కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగానే పవన్ రావడం లేదని తెలిపాడు. అలాగే ఫంక్షన్ కు అనుమతులు వచ్చాయని, అయితే, వేదికను ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న దానిపై స్వయంగా చిరుయే స్పందిస్తారని ఆయన వివరించాడు. ఇక సినిమా రిలీజ్ పై కూడా ఈ సాయంత్రంలోపు ఓ స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే యూ బై ఏ సర్టిఫికెట్ పొందిన ఖైదీ ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 10వ తేదీ ప్రీమియర్ షోలు దాదాపు ఖరారు కావటంతో 11నే ఖైదీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఇక అన్ని రైట్స్ కలుపుకుని సుమారు 100 కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఖైదీ టాలీవుడ్ టాప్ 3లో చోటు సంపాదించుకుంటే హిట్ కేటగిరి లో కి వచ్చేస్తుంది. అంటే జనతా గ్యారేజ్ ను క్రాస్ చేస్తే తప్పించి బయ్యర్లు సేఫ్ కారన్న మాట. ఇక శాటిలైట్ రూపంలో 13 కోట్లు దక్కగా.. ఆడియో-వీడియో-డిజిటల్ రైట్స్ రూపంలో 1.5 కోట్లు రాగా, మిగతా 92.5 కోట్లు మెగా టార్గెట్ వసూలు చేయటం చిరు ముందున్న లక్ష్యం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar Chiranjeevi  Khaidi No 150  Pre release function  release date  

Other Articles