పవన్ ఎందుకలా చేశాడో తెలీదు.. నిర్మాత ప్రసాద్ | BVSN about pawan controversy.

Producer opens up on powerstar complaint

BVSN Prasad, Pawan Kalyan, Attarintiki Daredi Producer, Attarintiki Daredi controversy, BVSN Prasad about Pawan Kalyan, Producer Pawan War, Pawan about BVSN Prasad, Prasad about Pawan Kalyan, Pawan Prasad controversy, Pawan troubles AD producer, Sri Venkateswara Cine Chitra

BVSN Prasad finally Opens up About Pawan Kalyan's Case.

పవన్ తో గొడవ గురించి టాప్ ప్రొడ్యూసర్

Posted: 12/29/2016 06:12 PM IST
Producer opens up on powerstar complaint

ఆర్థికంగా ఆదుకునే విషయంలో ఎప్పుడూ ముందుండే పవన్ అత్తారింటికి దారేది నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ విషయంలో చేసిన వ్యవహారం మాత్రం పెను దుమారమే లేపింది. ఈ యేడాది సంక్రాంతికి నాన్నకు ప్రేమతో రిలీజ్ అయ్యే సరిగ్గా రెండు రోజుల ముందు తన పెండింగ్ అమౌంట్ ఇవ్వాలంటూ పవన్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయటం హాట్ డిస్కషన్ గా మారింది. పవన్ నుంచి ఇలాంటి ట్విస్ట్ వస్తుందని చాలా మంది ఊహించుకోలేకపోయారు. కొందరైతే దీనిని మెగా, నందమూరి వార్ అంటూ కలరింగ్ ఇచ్చేశారు. ఏదైతేనేం వెంటనే రంగంలోకి దిగిన ప్రసాద్ పవన్ కలిసి సమస్యను వెంటనే పరిష్కారం చేసి సినిమా రిలీజ్ అడ్డంకులు తొలగించాడు.

ఆపై ఆ టాపిక్ ను ఎవరూ లేవనెత్తలేదు. అయితే ఇప్పుడు తన నిర్మాణంలో తెరకెక్కిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన ఆయన ఆ విషయం ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆ విషయంలో పవన్ ప్రవర్తించిన తీరు తనకు ఆశ్చర్యం కలిగించిందని అంటున్నాడు. ‘అత్తారింటికి దారేది సినిమాకిగాను నేను పవన్‌కి కొంత అమౌంట్ ఇవ్వాలి. అది కాస్త ఆలస్యమైంది. అయినా అలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు.

‘‘పవన్ నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు. నేనే ఇబ్బంది పడ్డాను.. అంతే. అది ఎందుకు జరిగిందో కానీ జరిగిపోయింది. ఆ సమయంలో అలాంటి పరిస్ధితిలో నేనుండడం నా దురదృష్టంగా భావిస్తున్నా. పవన్ ఫిర్యాదు వల్ల ‘నాన్నకు ప్రేమతో’ రిలీజ్ సమయంలో ఏమైనా ఇబ్బంది పడ్డానా అంటే.. అలాంటివి జరుగుతుంటాయి.. జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్లాలి అని తెలుసుకున్నాను’’ అని వివరించాడు. అదే సమయంలో అత్తారింటికి దారేది పైరసీ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి పవన్‌, త్రివిక్రమ్‌ ఎంతో సాయం చేశారని కూడా గుర్తు చేసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Attarintiki Daredi Producer  BVSN Prasad  Controversy  

Other Articles