సమంత క్రిస్మస్ విషెస్ పై విమర్శలు | Samantha in Bikini Christmas wishes.

Samantha special christmas wishes

Tollywood Actress Samantha, Samantha Bikini, Samantha Bikini Christmas wishes, Samantha back Bikini, Samantha Bikini Naga Chaitanya, Samantha Special Christmas, Samantha Ruth Prabhu new bikini, Tollywood Actress Bikini, Samantha Hot Bikini, Samantha Sea Bikini, Samantha Engagement date

Tollywood Actress Samantha Hot Bikini Christmas Wishes in Instagram.

సమంత క్రిస్మస్ ఫోటో రచ్చ.. రచ్చ...

Posted: 12/26/2016 08:47 AM IST
Samantha special christmas wishes

ప్రస్తుతం ఇయర్ ఎండింగ్ వెకేషన్ నడుస్తోంది. షూటింగ్ లు లేకపోవటంతో హీరోహీరోయిన్లంతా టూర్లకు చెక్కేశారు. మరి సమంత కూడా ఔట్ డోర్ వెళ్లిపోయి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తోడుగా తన కాబోయే భర్త నాగచైతన్యను కూడా పట్టికెళ్లిందట. ఊరుకుంటుందా? అక్కడ బీచ్ లో తెగ హంగామా చేసేస్తోంది. హ్యాపీ క్రిస్మస్ అంటూ తన ఇన్ స్టా లో ఓ ఫోటోను ఉంచింది. తాను కోరుకున్న విధంగా సముద్రం చాలా బాగుందని తన ఆనందాన్ని పంచుకుంది.

తాను బికినీలో వెనక్కి తిరిగి ఉన్న ఫొటోలను పెట్టి అందరికీ మెరీ క్రిస్మస్ అని చెప్పింది. ఇప్పటివరకూ సమంతను గ్లామరస్ యాంగిల్ లో అభిమానులు చాలాసార్లే చూశారు. ఇంతకు ముందు సూర్య సికిందర్ (తమిళ్ లో అంజాన్) లో కొద్ది సెకన్లు టూపీస్ బికినీలో సందడి కూడా చేసినా ఎడిటింగ్ లో లేపేశారు లేండి. అక్కినేని ఫ్యామిలీ కోడలు కానుండడంతో.. నీళ్లలో సగం వరకూ నుంచుని అటు తిరిగి ఫోటోలకు పోజులిస్తోంది సమంత. ఇక ఇప్పుడు ఫొటోలను చూసిన నెటిజన్లు సామ్ కు కూడా విషెస్ తెలిపారు.

అప్పటి నుంచి ఈ రేంజ్ లో హాట్ నెస్ తో దర్శనం ఇవ్వలేదు లేండి. పెళ్లికి ముందు చేసే ఎంజాయ్ మెంట్ ను స్వీట్ మెమరీస్ గా.. ఈ ఫోటోలను చైతునే తీసి పోస్ట్ చేస్తున్నాడో లేదో తెలీదు కానీ.. సమంత చేస్తున్న ఈ బికినీ రచ్చ మాత్రం హాట్ టాపిక్ అయిపోతోంది. అయితే కొందరు సమంతను తాము ఇలా చూడాలనుకోవడంలేదని, ఇలా కనిపించవద్దని కోరగా, అద్భుతమైన స్టిల్ అని, సముద్రం కంటే చాలా బాగుందంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ జంట నిశ్చితార్ధం జనవరి 29న జరగనుందన్న వార్త ఈ మధ్య జోరుగా వినిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Samantha  Naga Chaitanya  Vacation  Bikini Christmas  

Other Articles