ఫోర్బ్స్ లిస్ట్: టాలీవుడ్ లో మహేషే మళ్లీ తోపు | Mahesh Babu top again in Forbes.

Mahesh babu top again in forbes list

Mahesh Babu, Mahesh Babu Forbes Celebrity 100 list, Forbes Celebrity list 2016, Forbes Celebrity 2016, South Forbes Celebrity list, Mahesh Babu Allu Arjun Forbes list, Mahesh Rajinikanth Forbes

Forbes Celebrity 100 list for Tollywood, Mahesh Babu top again.

ఫోర్బ్స్ లిస్ట్ లో మళ్లీ మహేషే టాప్

Posted: 12/23/2016 07:05 PM IST
Mahesh babu top again in forbes list

టాలీవుడ్ సూపర్ స్టార్ మరోసారి తన సత్తా చాటాడు. ప్రముఖ మాగ్జైన్ ఫోర్బ్స్ జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. సౌత్ తరపున లిస్ట్ లో రజనీ కాంత్ తర్వాత నిలిచినప్పటికీ, టాలీవుడ్ తరపున టాప్ పొజిషన్ లో ఉన్నాడు. గతేడాది ఈ జాబితాలో మహేష్ 36వ స్థానంలో ఉండగా, ఈ యేడాది మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 33కి చేరాడు. ఇక సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ 30వ స్థానంలో నిలిచాడు. సంపాదన, ఫాలోయింగ్ ఆధారంగా ఫోర్బ్స్ పత్రిక ఏటా ఈ ర్యాంకింగ్‌లను ప్రకటిస్తోంది. లిస్టులో గత కొద్ది సంవత్సరాలుగా ప్రిన్స్ మహేష్ బాబు కొనసాగుతూనే ఉన్నా ఈ సంవత్సరం ఈ శ్రీమంతుడు తన ర్యాంక్ ను మరింత మెరుగు పరుచుకున్నాడు.

మురగదాస్ సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకున్న మహేష్ ఎలా చూసుకున్నా టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాడని చెప్పుకోవాలి. యూత్; ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ అని తేడా లేకుండా అన్ని వర్గాలకు మహేష్ ఫేవరెట్ గా ఉంటాడన్నది తాజా ర్యాంకుతో మరోసారి తేటతేల్లమైంది. మహేష్ తర్వాత టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 43వ స్థానంలో నిలుచున్నాడు.

దక్షిణాది నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌ 30వ స్థానంలో నిలవగా, అల్లుడు మరో హీరో ధనుష్‌ (47), కమల్‌ (49), సూర్య (51), విజయ్‌ (61) స్థానాలను ఆక్రమించారు. మరోవైపు గతేడాది జాబితాలో తెలుగు దర్శకుడు రాజమౌళి 72వ స్థానం సాధించగా.. ఈ సారి టాప్‌-100లో చోటు కోల్పోయారు. ఇండియాలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నది కండల వీరుడు సల్మాన్ ఖాన్. రూ. 270. 33 కోట్లు అతడి వార్షిక సంపాదన. సెకెండ్ ప్లేస్ లో మరో ఖాన్ షారుఖ్ నిలిచాడు. బాద్ షా సంపాదన రూ. 221.75 కోట్లు. మూడో స్థానంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. రూ. 134.44 కోట్లు ఈ యంగ్ క్రికెటర్ సంపాదన.

ఈ ఏడాది టాప్ 100 జాబితాలో 14 మంది కొత్తవాళ్లుచోటు దక్కించుకోవడం విశేషం. వీరిలో ఒలంపిక్ మెడల్ విజేత పీవీ సింధు (62 ) చెఫ్ సంజీవ్ కుమార్ (73) ర్యాపర్ బాద్ షా, (81) తదితరులు ఫోర్బ్స్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇక టెన్నిస్‌ దిగ్గజం సానియా(29), సైనా నెహ్వాల్‌(31), పీవీ సింధు (62), సాక్షిమాలిక్‌ (80), మేరీ కోమ్‌ (88) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. క్రీడా విభాగం పరంగా కూడా కోహ్లినే అగ్రస్థానంలో ఉండగా, ఇక ధోనీ (5), సచిన్‌ (7), రోహిత్‌ శర్మ(16), యువరాజ్‌ (17) తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా ఈ ఏడాది ఖ్యాతి పరంగా తొలి స్థానంలో కోహ్లి నిలిచాడు.


ఫోర్బ్స్ సెలబ్రిటీ జాబితా:
2016లో మహేష్ బాబు ఆదాయం రూ.42 కోట్లు
43వ స్థానంలో అల్లు అర్జున్, ఆదాయం 27 కోట్లు
51వ స్థానంలో సూర్య,
53వ స్థానంలో కాజల్ అగర్వాల్
55వ ర్యాంక్‌ సాధించిన జూనియర్ ఎన్టీఆర్, ఆదాయం రూ.36 కోట్లు
67వ ప్లేస్‌లో రామ్‌చరణ్, ఆదాయం రూ.26 కోట్లు
62వ ప్లేస్‌తో సెలబ్రిటీ లిస్ట్‌లో చోటు సంపాదించిన పీవీ సింధు, ఆదాయం రూ.3.42 కోట్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Forbes list 2016  Mahesh Babu top  

Other Articles