అన్నయ్య-తమ్ముడు.. ఒక్కడినే కుమ్ముకుడు.. అనుకోకుండా జరిగిందా? | Tarun Arora villian for Mega Brothers.

Same villain for khaidi and katamarayudu

Tarun Arora, Katamarayudu villian, Mega Brothers same villian, Khaidi No 150 and Katamarayudu, Khaidi No 150 Villian, Tarun Arora Mega Villain, Tarun Arora and Pawan kalyam, Tarun Arora and Chiranjeevi

Tarun Arora Villain for Mega Brothers – Khaidi No 150 and Katamarayudu.

మెగా బ్రదర్స్ కామన్ విలన్ గురించి...

Posted: 12/23/2016 12:28 PM IST
Same villain for khaidi and katamarayudu

చాలా గ్యాప్ తరువాత చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' చేస్తుండటంతో, ఆయనకి తగిన విలన్ కోసం చాలామంది పేర్లను పరిశీలించి చివరికి 'తరుణ్ అరోరా'ను ఎంపిక చేశారు. బాలీవుడ్ లో పలు చిత్రాలు చేసిన తరుణ్,
ఈ యేడాది మొదట్లో అధర్వ హీరోగా వచ్చిన కనిథన్ లో స్టైలిష్ విలన్ గా అలరించాడు. పైగా హీరోయిన్ అంజలా ఝవేరీ భర్త కావటంతో చిరు 150లో ఈజీగానే ఛాన్స్ కొట్టేశాడు తరుణ్.

ఇదిలా ఉంటే పవన్ 'కాటమరాయుడు' సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు తరుణ్. ఈ సినిమాలో విలన్ పాత్ర పవర్ ఫుల్ గా వుంటుందట. చాలా వైవిధ్యంగా ఈ పాత్రను దర్శకుడు బాబీ డిజైన్ చేశాడట. ఈ
సమయంలోనే తరుణ్ అరోరా యాక్టింగ్ స్టైల్ గురించి తెలిసి ఆయనని తీసుకున్నారని అంటున్నారు. అయితే ఖైదీకి సంప్రదించే కొద్ది రోజుల ముందు నుంచే తరుణ్ ను కాటమరాయడు కోసం కాంటాక్ట్ అవ్వటం, దానికి కూడా సైన్ చేయటం జరిగిపోవటం కూడా అయ్యాయంట. కానీ, ఖైదీ షూటింగ్ లోనే ముందుగా పాల్గొనటంతో, రిలీజ్ అవుతుండటం విశేషం.

ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. పవన్ అండ్ బ్రదర్స్ మద్య జరిగే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పవన్ సరసన శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. జనవరి 12న ఖైదీ విడుదల అవుతుండగా, మార్చి 29 ఉగాది సందర్భంగా కాటమరాయుడు రాబోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tarun Arora  Mega Villian  Khaidi No 150  Katamarayudu  

Other Articles