2016 టాలీవుడ్ టాప్ ట్రెండింగ్ పాటలు తెలుసా? | tollywood 2016 trending songs.

Tollywood 2016 trending songs

tollywood 2016, Telugu movies 2016 songs, Tollywood 2016 chart buster songs, Tollywood 2016 top ten songs, 2016 top ten songs, Telugu top albums 2016, Tollywood song of the year 2016

Top 10 Telugu Songs Of The year for 2016.

టాలీవుడ్-2016 టాప్ సాంగ్స్ ఇవే...

Posted: 12/21/2016 01:18 PM IST
Tollywood 2016 trending songs

పాత సంవత్సరానికి వీడుకోలు పలకబోతున్నాం. గత ఏడేళ్లుగా ఎప్పుడూ లేని విధంగా ఈ యేడాది టాలీవుడ్ లో అత్యధిక హిట్ సినిమాలు వచ్చాయి. ఊహించని సినిమాలు రికార్డులు కొల్లగొడితే, ఊహించినవి దారుణంగా విఫలమయ్యాయి. ఇక ఆయా చిత్రాల్లో అనేక హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ఈ యేడాదికి గానూ ఇండస్ట్రీ ఛార్ట్ బస్టర్స్ గా నిలిచిన ఓ పది సాంగ్స్ ను ప్రేక్షకుల ఓటింగ్ మేరకు టాప్ లిస్ట్ లో చేర్చారు.

1. జనవరి 1 విడుదలైన రామ్ నటించిన నేను శైలజ మూవీ. రాం కెరీర్ బ్యాక్ కి సహకరించటమే కాదు, అద్భుతమైన మ్యూజికల్ హిట్ గా నిలిచిపోయిందీ చిత్రం. ముఖ్యంగా క్రేజీ క్రేజీ ఫీలింగ్ పాటకు ఆన్ లైన్ లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దేవీశ్రీప్రసాద్ అందించిన ఈ బాణీలు గతేడాది చివర్లో మార్కెట్లోకి వచ్చి ఆ యేడాదికి గానూ బెస్ట్ ట్రాక్ లిస్ట్ లో చోటు సంపాదించుకోవటం విశేషం.

2. సంక్రాంతికి రిలీజ్ అయిన శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా చిత్రం. ప్రవీణ్ లక్కరాజు అందించిన పాటలకు బాగానే స్పందన వచ్చింది. ముఖ్యంగా కలర్ ఫుల్లు చిలకా పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

3. సోగ్గాడే చిన్నినాయనతో పండగ సీజన్ కి ఫర్ ఫెక్ట్ విజయాన్ని అందుకున్నాడు టాలీవుడ్ నవమన్మథుడు నాగార్జున. డిక్కా డిక్కా డుం డుం అంటూ సోగ్గాడే చిన్నినాయనలో నాగార్జున పాడిన పాట ఎఫ్            ఎంలలో మారుమోగిపోయింది.

4. నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ కెరీర్ లో మరో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ చిత్రంగా నిలిచిపోయింది. ఇందులో స్వయంగా తారక్ పాడిన ఫాలో ఫాలో సాంగ్ కి జనాలు బెస్ట్ సాంగ్ గా ఓటేయటమే కాదు, ప్రతిష్టాత్మక మిర్చి            అవార్డులలో బెస్ట్ సింగర్ గా జూనియర్ కి అవార్డు కట్టబెట్టింది. 

5. కృష్ణగాడి వీర ప్రేమగాధలో.. నువ్వంటే నా నవ్వు పాటకు కూడా ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభించింది. కొత్త సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన బాణీలు బాగానే చక్కర్లు కొట్టాయి.

6. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ లో తోబతోబ అంటూ సాగే మాస్ బీట్.. రచ్చ రచ్చ చేసిసింది. ఈ పాట అమితాబ్ లావారిస్ లోని అప్ నీ తో జైసే... ఇన్సిఫిరేషన్ అని దేవీ ఓపెన్ గా చెప్పేసిన         ఆదరణ మాత్రం పిచ్చ పిచ్చగా వచ్చేసింది.

7. సరైనోడుతో సాలిడ్ బ్లాక్ బస్టరే కొట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. థమన్ అందించిన సరైనోడు టైటిల్ ట్రాక్ విపరీతంగా పాపులర్ అయింది.

8. నితిన్-సమంత జంటగా నటించిన అ.ఆ.. చిత్రంలో మిక్కీ జేయర్ అందించిన కలర్ పుల్ సాంగ్ రంగ్ దే.. చార్ బస్టర్ లలో ఒకటిగా నిలిచింది.

9. జనతా గ్యారేజ్ లోని ప్రణామం ట్రాక్ కు ఎన్టీఆర్ స్టైలిష్ స్టెప్పులు, ప్రకృతి గొప్పతనం వర్ణిస్తూ సాంగే సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇందులోని పక్కా లోకల్ పాట కన్నా దీనికే ఎక్కువ ఓట్లు రావటం విశేషం.

10. ఇక చివరగా నాని మజ్ను సినిమాలోని కళ్లు మూసి తెరిచేలోగా పాటకు చోటుదక్కింది.

ఇవేగాక మహేష్ బాబు బ్రహ్మోత్సవం మూవీలో మధురం మధురం పాటను సినిమా రిలీజ్ కి ముందే విడుదల చేయగా.. బోలెడంత రెస్పాన్స్ వచ్చింది. ఊపిరిలోని ఒక లైఫ్.. నాగచైతన్య మూవీ ప్రేమమ్ లో 'ఎవరే.. ఎవరే' టాప్, జో అచ్యుతానంద టైటిల్ ట్రాక్.. మంచి రెస్పాన్స్ వచ్చిన పాటల్లో కొన్ని. సుప్రీంలోని అందం హిందోళం రీమిక్స్.. వెంకీ బాబు బంగారం టైటిల్ ట్రాక్.. చైతూ సాహసం శ్వాసగా సాగిపో మూవీలో వెళ్లిపోమాకే అంటూ ఏఆర్ రెహమాన్ అందించిన బీట్.. టాప్ ఛార్ట్ బస్టర్స్ లో నిలిచింది. ఇక జెంటిల్మెన్ చిత్రంలోని చలిగాలి చూడు.. రామ్ చరణ్ ధృవలో పరేషానురా పాటకి విజువల్ గా మంచి మార్కులు పడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood 2016  chart buster songs  top ten list  

Other Articles