వర్మ నెక్స్ట్ టార్గెట్ శశికళ.. ఏం చేయబోతున్నాడు? | RGV registered new title as Shashikala.

Rgv what doing with shasikala

Ram Gopal Varma, RGV, Shasikala Movie, RGV new movie, RGV Shasikala, Movie on Shasikala, Jalalitha Shasikala, Shasikala Movie, RGV Shasikala biopic, RGV Tamil Nadu politics, Tamil Nadu Shasikala Varma, Vama Sasikala, Vama Shasikala

Ram Gopal Varma New Movie title Shashikala. Inspired by Jayalalitha's aid Sasikala.

వర్మ కంట్లో పడితే ఇక అంతే...

Posted: 12/16/2016 10:17 AM IST
Rgv what doing with shasikala

రాంగోపాల్ వర్మ సినిమాల కన్నా సన్సేషన్ ప్రకటనలతోనే వార్తల్లో బాగా నానుతుంటారు. దర్శకుడిగా ఇప్పటిదాకా తీసిన సినిమాల కంటే కాంట్రవర్సరీలతో సైడయిపోయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరంగా ఆటంకాలు అన్నీ దాటుకుని రిలీజ్ అయిన సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ సినిమాలే కావటం విశేషం.

ముంబై దాడులు, రక్తచరిత్ర ఇలా సినిమా ఏదైనా కంటెంట్ ను చెడగొట్టకుండా రియల్ ఇన్సిండెంట్ లలో ఉన్న డెప్త్ ను బాగా క్యాచ్ చేసే వర్మ వాటిని తెరపై అద్భుతంగా తెరకెక్కించటమే అందుకు కారణం. రీసెంట్ గా వంగవీటి తో మరోసారి వార్తల్లోకి నిలిచిన వర్మకి వంగవీటి ఫ్యామిలీ నుంచి చిక్కులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో మరో బాంబ్ పేల్చేశాడు వర్మ.

శశికళ అనే పేరుతో తన కొత్త సినిమా టైటిల్ ను రిజిస్టర్ చేసినట్లు ప్రకటించాడు. శశికళ ఓ రాజకీయ పర్సనాలిటీ బాగా దగ్గరి వ్యక్తి అయిన ఈమెపై త్వరలో సినిమా తీయబోతున్నా అంటూ చెప్పేశాడు. అయితే పూర్తి ప్రేమకథగా దీనిని తీయబోతున్నాడంట. ఇది ఎవరినీ ఉద్దేశించింది కాదు. కేవలం కల్పితమే, తమిళరాజకీయాలపై ఈ సినిమా ఉండబోతుంది అంటూ మరోదాంట్లో పేర్కొన్నాడు. ఆపై వరుసగా జయలలిత, శశికళల గురించి పేర్కొంటూ ట్వీట్లతో నింపేశాడు.

బయోపిక్ లు అంటే ఏ రాజకీయ నేతో, లేక సినిమా స్టారో, స్పోర్ట్స్ సెలబ్రిటీయో ఇలా తీయాలని బాలీవుడ్ దర్శకులు తహతహలాడుతుంటారు. కానీ, వెరైటీ నయీం, దావూద్, శశికళ పేర్లతో సినిమాలు తీస్తూ హైప్ ఫ్లస్ అటెన్షన్ కొట్టేస్తున్నాడు వర్మ. ఈ విషయంలో వర్మను కొట్టే దర్శకుడు మున్ముందు రావటం కష్టమే సుమీ.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  New Movie Title  Shasikala  

Other Articles