2016 పొటుగాడు ఎవరో తెలుసా? | google 2016 most searched hero.

2016 goggle tollywood most searched hero

Allu Arjun 2016 google, Bunny 2016 top, google 2016 tollywood heroes, Tollywood Top Heroes 2016, Bunny NTR 2016 top, Bunny google list, Allu Arjun 2016, Google tollywood heroes, Tollywood top trending 2016

Allu Arjun top in Google most searched Tollywood hero in 2016.

గూగుల్-2016 టాప్ లో నిలిచిందెవరంటే...

Posted: 12/16/2016 08:19 AM IST
2016 goggle tollywood most searched hero

కొత్త సంవత్సరం ముగుస్తోంది. ఈ యేడాది తెలుగులో వందకు పైగే సినిమాలు వచ్చాయి. అందులో దాదాపు ఓ 20 దాకా భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. సైలెంట్ గా వచ్చి హిట్లు కొట్టినవి డజనుపైనే. అదే సమయంలో కొలుకొలేని డిజాస్టర్లను కూడా టాలీవుడ్ చవి చూసింది. మరి ఈ యేడాది హీరోలలో ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్నారు?. వారి ర్యాంకులేంటో ఇప్పడు చూద్దాం.

నెంబర్ వన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నెంబర్ టూ ప్రిన్స్ మహేష్ బాబు, నెంబర్ త్రీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నెంబర్ ఫోర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, నెంబర్ ఫైవ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... సిక్స్ వన్ కళ్యాణ్... ఈ ఏడు టాలీవుడ్ నటుల్లో ఎవరికోసం ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేశారన్న దానిపై గూగుల్ ఇలా ర్యాంకులు విడుదల చేసింది. ఇక సమంత, నాగ చైతన్యల ప్రేమ వ్యవహారంతో హాటెస్ట్ కపుల్ గా వారు నిలిచారు. జనసేన మీటింగ్ లతో పవన్ సినిమాల కంటే ఎక్కువ ట్రెండ్ కావటం విశేషం.

వరుసగా యాభై కోట్ల బ్లాక్ బస్టర్లు అందిస్తూ.. ఈ యేడాది సరైనోడుతో సాలిడ్ హిట్ కొట్టాడు బన్నీ. ఫేస్ బుక్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా ట్విట్టర్ లో ప్రవేశించిన అల్లు అర్జున్ అతితక్కువ సమయంలో మిలియన్ అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడు గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటుడిగా అల్లు అర్జున్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. కాగా, బన్నీకి కోలీవుడ్, మాలీవుడ్ లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. ప్రధానంగా మలయాళంలో విశేషమైన ఆదరణ ఉంది. ఆ తర్వాత మహేష్, బాహుబలితో ప్రభాస్, ఎన్టీఆర్, రాం చరణ్, పవన్ కళ్యాణ్ లు నిలిచారు.

ఎవరికి వారే తోపులు...

ముందు ఈ లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలిచాడని వార్తలొచ్చాయి. దీంతో నందమూరి అభిమానులు రెచ్చిపోయారు. కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ అభిమానులు లైన్లోకి వచ్చారు. ఎన్టీఆర్ కాదు.. బన్నీనే మోస్ట్ సెర్చ్డ్ హీరో అంటూ హంగామా చేశారు. ఎన్టీఆర్ అనే పదంతో వెతికినపుడు ఎన్టీఆర్ అగ్రస్థానంలో ఉన్నాడట. బన్నీ రెండో స్థానంలో నిలిచాడు.

మహేష్ బాబు..  ప్రభాస్... రాంచరణ్... పవన్ కళ్యాణ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐతే జూనియర్ ఎన్టీఆర్ అనే పద బంధంతో కలిపి వెతికినపుడు అతడి స్థానం నాలుగుగా ఉంది. అల్లు అర్జున్ అగ్ర స్థానంలో ఉన్నాడట. మహేష్ బాబు రెండో స్థానంలో.. ప్రభాస్.. పవన్ కళ్యాణ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారని అభిమానులు అంటున్నారు. హీరోల అభిమానులు ఎవరి వెర్షన్లు వాళ్లు వినిపిస్తూ మా హీరోనే నెంబర్ వన్ అంటూ మురిసిపోతున్నారు. ఐతే వాస్తవంగా గూగుల్ ప్రకటించిన దాంట్లో మాత్రం బన్నీ పేరే నంబర్ వన్ గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Google 2016 tollywood  Top Heroes list  

Other Articles