సునీల్ ను పెట్టుకుని రిస్క్ చేస్తున్నాడా? | Sunil role in Pawan Trivikram Movie.

Sunil in pawan trivikram new movie

Trivikram Pawan Sunil, Sunil role in Pawan Movie, Pawan Kalyan Trivikram Srinivas third movie, Pawan New Movie, Pawan risk with Sunil, Sunil in Pawan movie, Pawan kalyan Sunil

Sunil role confirmed in trivikram pawan kalyan new movie.

సునీల్ కోసం వాళ్ల రిస్క్ నిజమేనా?

Posted: 12/12/2016 06:04 PM IST
Sunil in pawan trivikram new movie

టాలీవుడ్ లో పదేళ్లపాటు టాప్ కమెడియన్ గా కొనసాగాక ఇక మళ్లీ కమెడియన్ వేషాల జోలికి పోకుండా హీరోగా మారిపోయాడు సునీల్. అయితే టైం బ్యాడ్ కావటంతో చేసిన సినిమాలన్నీ వచ్చినవి వచ్చినట్లే పోతున్నాయ్. ఈ క్రమంలో సునీల్ చేతిలో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘ఉంగరాల రాంబాబు’, ఎన్.శంకర్ డైరెక్షన్లో ‘టు కంట్రీస్’ రీమేక్ ఉన్నాయి. అంటే ఇవే అతని భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయన్న మాట. ఇదిలా ఉంటే మరో గోల్టెన్ ఛాన్స్ ఇప్పుడు సునీల్ ను వరించబోతుందన్న వార్త దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది.

పవన్, త్రివిక్రమ్ త్వరలో తీయబోయే సినిమాలో సునీల్ కి ఓ రోల్. తన బెస్ట్ ఫ్రెండ్ కోసం త్రివిక్రమ్ ఓ పాత్రను రూపొందించాడన్నది దాని సారాంశం. నిజానికి హీరోగా ‘పూల రంగడు’ తో హిట్టు కొట్టాక కేవలం త్రివిక్రమ్ కోసమే నటించాడు సునీల్. దీంతో ఇప్పుడు వరుస ఫ్లాపులతో ఉన్న సునీల్ ను తన సినిమాలో ఓ రోల్ తో పైకి లేపాలని మాటల మాంత్రికుడు ఫ్లాన్ వేశాడంట.

నిజానికి ‘ఖైదీ నెంబర్ 150’లో ఓ కీ రోల్ వచ్చినప్పటికీ, డేట్ల కారణంగా సునీల్ దానిని వదులుకున్నాడు. మరి కనీసం పవన్ సినిమాలో అయినా నాన్-హీరో రోల్ లో కనిపించి ఏ మేర ఎంటర్ టైన్ చేస్తాడో చూడాలి. ఇంతకు ముందు జల్సాలో సునీల్ రోల్ ఎంత కామెడీ పండించిందో తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  trivikram srinivas  new movie  Sunil  

Other Articles