ఆ బీగ్రేడ్ నటి భర్త మాంత్రికుడు.. కేసు నమోదు | actress Babilona control of black magic

Case filed on actress babilona

Actress Babilona, Babilona's Husband, Babilona black magic, black magic on Babilona, Kollywood actress Babilona

Grand mother complaint on Actress Babilona's Husband did black magic.

బీ గ్రేడ్ హీరోయిన్ పై పోలీస్ కంప్లైయింట్

Posted: 12/01/2016 04:09 PM IST
Case filed on actress babilona

కోలీవుడ్ లో ఓ నటి పై పోలీస్ ఫిర్యాదు నమోదు కావటం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. బీ గ్రేడ్ సినిమాలతో పాపులర్ అయిన నటి బాబీలోనా వైవాహిక జీవితం గురించి ఆమె కుటుంబ సభ్యులే ఫిర్యాదు చేయటం ఇక్కడ కొసమెరుపు. ఓ తాంత్రికుడి వలలో ఆమె చిక్కుకు పోయిందని, ఆమెను విడిపించాలని కొరుతూ అందులో పేర్కొన్నారు.

ఈ శృంగార తార ఓ మాంత్రికుడి వలలో పడిందని ఆమె బామ్మ కృష్ణకుమారి పోలీసులను ఆశ్రయించింది. సాలిగ్రామంలో నివసిస్తున్న కృష్ణకుమారి ఈమేరకు గత మంగళవారం చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు తెలిపింది. బాబీలోనా ‘పిరందాచ్చు’ అనే చిత్రంతో కోలీవుడ్ లో ఆరంగ్రేటం చేసింది. ఆపై ఐటెం సాంగులు, చిన్న హీరోల సినిమాల్లో వ్యాంప్ తరహా పాత్రలతో బాగానే గుర్తింపు పొందింది. తన మనవరాలు ఈ పొజిషన్ కి చేరడానికి తానే కారణమంటూ ఆమె చెబుతోంది.

కాగా, ఆరణి ప్రాంతానికి చెందిన సుందర్‌ పాల్‌రాజ్‌ అనే వ్యక్తిని గతేడాది ప్రేమ వివాహం చేసుకుంది. తామిద్దరం ఇష్టపడే వివాహం చేసుకున్నామని చెబుతున్న బాబీలోనా, ఆ కేసును కొట్టేయాలని విజ్నప్తి చేస్తోంది. ప్రస్తుతం అక్కడి మీడియాలో బాబీలోనా ఇంటర్వ్యూ అన్ని ఛానెల్ లలో వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Babilona  Kollywood actress  police complaint  Dark Magic  

Other Articles