గొడవ మాట నిజమే.. కానీ, కారణం వేరే ఉందన్న జయసుధ | Jayasudha Clarity on Tiff with Producer

Jayasudha about clash with chadalavada

Actress Jayasudha, Chadalavada Srinivas Rao, Chadalavada Clarity, Jayasudha Chadalavada Clash, Jayasudha on Constable Venkatramaiah, Constable Venkatramaiah not shelved, Constable Venkatramaiah movie, Narayamurthy Jayasudha, Jayasudha actress, Jayasudha clears air

Jayasudha about clash with Chadalavada says she was not out from Constable Venkatramaiah.

అది చిన్న గొడవే.. సినిమాలో నేను ఉన్నాను

Posted: 12/01/2016 01:02 PM IST
Jayasudha about clash with chadalavada

షూటింగ్ కు ఆలస్యంగా వచ్చిందన్న కారణంతో నిర్మాత కమ్ దర్శకుడు చదలవాడ శ్రీనివాస్ తో నటి జయసుధ గొడవ పడిందన్న వార్త నిన్నంతా హల్ చల్ చేసింది. ఈ సీనియర్ నటి షూటింగ్ కు ఆలస్యంగా రావటంతో ఫైరయిన చదలవాడ అరవటంతో ఆమె షూటింగ్ నుంచి వెళ్లిపోయిందని చెప్పుకున్నాం. ఈ గొడవ కారణంగా ఇప్పుడు ఆమె సినిమా నుంచే తప్పుకోవటంతోపాటు, కానిస్టేబుల్ వెంట్రామయ్య దాదాపు ఆగిపోయినట్లే అనుకున్నారు.

విబేధాలు నిజమేనని కన్ఫర్మ్ అయినప్పటికీ, కారణం అదేనా అన్న విషయం మాత్రం ఎక్కడా క్లారిటీ లేదు. దీనిపై అటు చిత్ర యూనిట్ తరపు నుంచి గానీ, ఇటు జయసుధ నుంచి గానీ అఫీషియల్ గా స్పందన లేదు. అయితే గొడవ జరిగిన మాట వాస్తవేమనని, కానీ, దానికి కారణం వేరే ఉందని చెబుతోంది జయసుధ.

తన పర్సనల్ కాస్టూమ్స్ తీసుకోచ్చే వ్యక్తి ఆలస్యం చేయటంతో తాను షూటింగ్ కు లేటుగా వెళ్లానని, నిర్మాతకు ఆ విషయం తెలీక చిన్న గొడవ జరగటంతో షూటింగ్ కాన్సిల్ అయ్యిందని తెలిపింది. తాను ప్రాజెక్టు నుంచి తప్పుకోలేదని తెలిపిన జయసుధ అల్రెడీ వ్యవహారం సర్దుమణిగిందని, ఎల్లుండి నుంచి ఆమె షూటింగ్ లో పాల్గొంటానని తెలిపింది. దాసరి దర్శకత్వంలోనే ఓనమాలు దిద్దిన ఈ ఇద్దరి రేర్ కాంబినేషన్ లో సినిమా అనగానే అందరిలో ఆసక్తి నెలకొంది. సుదీర్ఘ పరిచయం కారణంగానే మూర్తితో సినిమా అనగానే జయసుధ ఒప్పేసుకుందంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Constable venkatramaih  Chadalavada Srinivas Rao  Jayasudha  Narayanamurthy  

Other Articles