బాలీవుడ్ లో తన పని అయిపోయిందన్న టాప్ సింగర్ | Bollywood singer Arijit Singh quitting Bollywood

Iconic singer retire soon

Arijit Singh, Arijit Singh retirement, Arijit Singh Bollywood, Arijit Singh songs, Arijit Singh carrier, Arijit Singh albums, Arijit Singh next plans

Arijit Singh Thinks His Career Is 'Almost' Over And He Might Have To Retire Next Year.

ఆషికి సింగర్ షాకింగ్ డెసిషన్

Posted: 11/30/2016 11:44 AM IST
Iconic singer retire soon

బాలీవుడ్ లో షార్ట్ పిరియడ్ లో క్లాసిక్ సింగర్ గా పేరు తెచ్చుకున్నాడు అర్జిత్ సింగ్. ఈ మధ్య కాలంలో అతని గాత్రం లేని ఆల్బం లేదంటే అతిశయోక్తి కాదు. రీసెంట్ గా వచ్చిన యే దిల్ హై ముష్కిల్ లో కూడా అతని పాటలే మనకు వినిపిస్తుంటాయి. అలాంటి ఈ యవ సింగర్ షాకింగ్ ప్రకటన చేశాడు. త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించాడు.

29 ఏళ్ల అర్జిత్ సింగ్ మర్డర్-2 సినిమాలోని పిర్ మొహబ్బత్ సాంగ్ తో కెరీర్ ను ప్రారంభించాడు. అంతకు ముందు పలు రియాల్టీ షోలలో గాయకుడిగా అలరించాడు. ఇక 2013లో ఆదిత్యరాయ్ శ్రద్ధాకపూర్ జంటగా వచ్చిన ఆషికి-2 అతని కెరీర్ ను మలుపుతిప్పింది. అందులోని తుమ్ హి హో పాట ఇప్పటికీ మారుమ్రోగుతుంటుంది. ఇక అక్కడి నుంచి అర్జిత్ హవా మొదలైంది. నాన్ స్టాప్ గా నాలుగేళ్లుగా అతను పాడుతూనే ఉన్నాడు. ఓవైపు స్టార్ల సినిమాలతోపాటు, సంగీత విభావరిలతోనూ పాపులారిటీ పెంచేసుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తానింక రిటైర్ అవుదామని ఆలోచిస్తున్నానంటూ ప్రకటించాడు.

బాలీవుడ్ లో ప్రతీ ఆరు, ఏడేళ్ల కోకసారి కొత్త సింగర్లు పుట్టుకొస్తూనే ఉంటారు. ఇలాంటి దశలో ఎక్కువ కాలం కొనసాగకపోవటమే మంచిదన్న అభిప్రాయాన్ని అర్జిత్ వ్యక్తం చేస్తున్నాడు. లో ఫ్రోఫైల్ మెయింటెన్ చేసే ఈ సెలబ్రిటీ సింగర్ ఇదే చివరి ఏడాది అని ప్రకటించటంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.  గోల్ మాల్ -3, బర్ఫీ, యే దిల్ హై ముష్కిల్, సనమ్ రే(టైటిల్ సాంగ్), దిల్ వాలే(గెరువా సాంగ్), తమాషా, తుమ్ బిన్-2, బేఫికర్ సినిమాల్లో అతని పాటలు యూత్ లో బాగా ఆదరణ పొందాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arijit Singh  Retirement  Bollywood Singer  

Other Articles