ఖాన్ మరదలు షాకింగ్ డెసిషన్ | Malaika Arora Khan and Arbaaz Khan spotted at a family court

No more khan in malaika arora s name

Arbaaz Khan, Malaika Arora, Malaika Arora Khan and Arbaaz Khan, Arbaaz Malaika divorce, Arbaaz Malaika family court, No Khan in Malaika's name

Arbaaz Khan and Malaika Arora Khan Filed For Divorce, Reaches Family Court.

అఫీషియల్: ఆమె పేరులో ఇక ఖాన్ ఉండదు

Posted: 11/30/2016 11:10 AM IST
No more khan in malaika arora s name

మరో సెలబ్రిటీ జంట వివాహ బంధం ముగిసిపోయింది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, నటి మలైకా అరోరాల 17 ఏళ్ల వివాహబంధం అధికారికంగా తెగిపోబోతుంది. గత కొంత కాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. వీరిద్దరినీ కలిపేందుకు సల్మాన్ తోసహా కుటుంబ సభ్యులంతా ప్రయత్నం చేశారు. అయితే అవేం ఫలించలేదు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న ఇద్దరూ... నిన్న ముంబైలోని ఫ్యామిలీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు.

పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్టు కోర్టులో డైవోర్స్ కు అప్లై చేశారు. హిందూ వివాహ చట్టంలోని విడాకుల దరఖాస్తుకు ముందు వీరిద్దరికీ ఆరు నెలలు లేదా ఏడాది సమయం ఇస్తుంది. ఆపై కూడా వీరిద్దరు విడాకుల మాట మీదే ఉంటే అప్పుడు మంజూరు చేస్తుంది. సుమారు ఐదేళ్లపాటు డేటింగ్ చేసిన వీరిద్దరూ ఆ తర్వాత ఇంట్లోవాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి ఒక కొడుకు(అర్హాన్) ఉన్నాడు.

అయితే బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో మలైకాకు అఫైర్ ఉండటమే... వీరిద్దరూ విడిపోవడానికి కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తని మలైకా ఖండించగా, సరైన రీజన్ చెప్పకుండానే తామిద్దరం విడిపోతున్నామంటూ గత మార్చిలోనే వారు ప్రకటించారు కూడా. రీసెంట్ గా ఓ డాన్స్ కార్యక్రమంకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న మలైకా విడాకులు పక్కా కావటంతో తన పేరు చివరలో ఖాన్ తొలగించాలని నిర్వాహకులకు కూడా సూచించిందంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arbaaz Khan  Malaika Arora  divorce  

Other Articles