నాగ్ సినిమా కోసం ఓంకార్ పారితోషకం టూమచ్? | Omkhar remuneration for Raju gari Gadhi 2

Omkhar shocking decision gor rgg 2

Director Omkhar, Raju gari Gadhi 2, Akkineni nagarjuna, Omkhar No Remuneration, Omkhar shocking decision, OAK production

No Remuneration For Ohmkar for Raju gari Gadhi 2

ఓంకార్ అన్నయ్య పెద్ద స్కెచ్చే వేశాడు

Posted: 11/28/2016 12:34 PM IST
Omkhar shocking decision gor rgg 2

బుల్లితెరపై రియాల్టీ షోలతో ఓంకార్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్ సినిమాలకు దర్శకత్వం చేసే ఛాన్సులను కట్టబెట్టింది. తొలి ప్రయత్నం ఘోరంగా విఫలమైన, మళ్లీ ప్రయత్నంలో మాంచి హిట్టే అందుకున్నాడు. రాజుగారి గది అంటూ ఓ మెసేజ్ ఓరియంటల్ హర్రర్ థ్రిల్లర్ ను అందించాడు. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఏకంగా నాగార్జునను లీడ్ రోల్ తో సీక్వెల్ తీసేందుకు సిద్ధమైపోతున్నాడు.

ఢిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను కూడా అంగీకరించాలి కదా అని నాగ్ వ్యాఖ్యానించినప్పుడే ఓంకార్ కథతో ఎంతగా కన్విన్స్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. మొదటి పార్ట్ ను సాయికొర్రపాటి సహాయంతో ఎలాగోలా బిజినెస్ చేయించుకున్న ఓంకార్, రెండో పార్ట్ కోసం ఏకంగా పీవీపీ బ్యానర్ నే నిర్మాతలుగా మార్చి పడేశాడు. మరి ఇంత సినిమాకు ఓంకార్ పారితోషకం రూపాయి కూడా తీసుకోలేదంటే నమ్ముతారా?

అవును.. ఓంకార్ ఈ సినిమా కోసం నో రెమ్యునరేషన్ అన్న కండిషన్ మీదే ముందుకు వెళ్తున్నాడంట. ఈ సినిమాకు పీవీవీతోపాటు మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ అనే మరో సంస్థ నిర్మిస్తోంది. అందుకే పారితోషకం తీసుకోకుండా, చిత్ర భాగస్వామిగా కొనసాగుతూ వచ్చే లాబాల్లో పెద్ద మొత్తాన్నే వెనకేసుకోవాలన్నదే ఓంకార్ అన్నయ్య ఫ్లాన్.

మరోపక్క నాగ్ కి మాత్రం భారీగానే రెమ్యునరేషన్ ఇస్తున్నారన్నది టాక్. ఇక రన్ రాజా రన్ హీరోయిన్ సీరత్ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందన్నది లేటెస్ట్ అప్ డేట్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Omkhar  Raju gari Gadhi 2  No remuneration  

Other Articles