నటిగా మారిపోయిన సింగర్ గీతామాధురి | Geetha Madhuri debut as actress.

First look of geetha madhuri as actress

Geetha Madhuri, Metro telugu movie, Geetha madhuri debut, Actress Geetha Madhuri, telugu Singer turns actress, Geetha Madhuri metro song

Geetha madhuri Metro Song Promo released.

మన తెలుగు సింగర్ కూడా నటించేసింది

Posted: 11/26/2016 09:04 AM IST
First look of geetha madhuri as actress

వేరే బాషలో సింగర్లు మన తెలుగుకు వచ్చి పాటలు పాడటమేకాదు, ఏకంగా యాక్టింగ్ రంగంలో కూడా దుమ్మ దులిపేయటం చూశాం. మమతా మోహన్ దాస్, ఆండ్రియాలు ఇదే కోవలోకి వస్తారు. కానీ, టాలీవుడ్ లో క్రేజీ సింగ‌ర్‌ గా గుర్తింపు పొందిన అచ్చ తెలుగు అమ్మాయి గీతామాధురి కన్ను కూడా ఇప్పుడు యాక్టింగ్ పై పడిపోయిందా? సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతుందని గత కొద్ది రోజులగా వస్తున్న వార్తలు నిజమేనా? అంటే అవుననే కన్ఫర్మ్ అయిపోయింది.

తమిళంలో రీసెంట్ గా మెట్రో అనే ఓ సినిమా వ్చింది. చెయిన్ స్నాచింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శిరీష్ అనే కొత్త హీరోతోపాటు, జాతీయ అవార్డు విన్నర్ బాబీ సింహా కీలకపాత్ర పోషించాడు. ఈ సినిమాను డబ్ చేసి త్వరలో తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇందులో గీతా మాధురితో ఓ ప్రత్యేక గీతాన్ని షూట్ చేశారు చిత్ర నిర్మాతలు. మెలోడియస్ గా సాగే పాటలో స్వయంగా తానే యాక్ట్ చేసింది ఈ హస్కీ సింగర్.

 

ఈ డైన‌మిక్ సింగ‌ర్ స్టైల్‌ని ఎలివేట్ చేస్తూ కొన్ని స్టిల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఫెంటాస్టిక్ నేరేషన్‌తో తెర‌కెక్కిన చిత్రం తెలుగులోనూ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని, గీతామాధురి సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని చిత్ర సమర్పకుడు సురేష్ కొండేటి తెలిపాడు. ఏ4 ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై ర‌జ‌నీ తాళ్లూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. డిసెంబర్ మూడో వారంలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. అవకావం వస్తే పూర్తి స్థాయి రోల్స్ తో కూడా అలరిస్తానని ఇప్పటికే గీతామాధురి చెప్పేసింది కూడా. ఈమె భర్త నందు ఇప్పటికే నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Geetha Madhuri  Metro movie  Video Song  

Other Articles