కూతురి బాయ్ ఫ్రెండ్ తో కారులో శ్రీదేవీ | Jhanvi's Boyfriend in Sridevi's Car.

Sridevi is ok with jhanvi s affair with shikhar

Sridevi, Jhanvi's relationship, Shikhar Pahariya, Sridevi daughter, Jhanvi's boyfriend Shikhar Pahariya, Shikhar Pahariya Sridevi, Sridevi at Dear Zindagi special show

Sridevi approves Jhanvi's relationship with boyfriend Shikhar Pahariya.

కూతురి అఫైర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?

Posted: 11/25/2016 11:06 AM IST
Sridevi is ok with jhanvi s affair with shikhar

ఈ మధ్య ఓ వార్త తెగ హల్ చేసింది. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ త్వరలో వెండితెర ఆరంగ్రేటం చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ కురు వృద్ధుడు సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహరియాతో జాన్వీ ప్రేమలో ఉందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, సినిమాల్లోకి రావాలంటే అలాంటి అఫైర్లకు పుల్ స్టాప్ పెట్టాలని శ్రీదేవి జాన్వీకి వార్నింగ్ ఇచ్చిందనేది ఆ వార్త సారాంశం.

కట్ చేస్తే... షారూఖ్, అలియా నటించిన డియర్ జిందగీ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేశారు. దీనికి శ్రీదేవి ఫ్యామిలీ మొత్తం హాజరయ్యింది. ఇక్కడ షాక్ కొట్టే సీన్ ఒకటి దర్శనమిచ్చింది. శ్రీదేవి, జాన్వీ పక్కపక్కన కూర్చోగా, అవతల మరో కుర్రాడు ఉన్నాడు. అతనేవరో కాదు శిఖర్ పహరియానే.

ముందు సీట్లో బోనీ కపూర్, వెనక సీట్లో ఈ ముగ్గురు ఇలా ఒకే కారులో వీరు నలుగురు కలిసి ప్రయాణం చేశారు. శ్రీదేవి కుటుంబంతో కలిసి శిఖర్ పహరియా కనిపించడం ఇదే తొలిసారి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోకి రావడంతో వైరల్ గా మారాయి. ఈ లెక్కన శ్రీదేవీ కూతురికి వార్నింగ్ ఇచ్చిన మ్యాటర్ ఉత్తదేనన్నట్లే కదా. అవేమోగానీ ప్రేమికుడితో ఏకంగా లిప్ లాక్ ఫోటోలనే అప్ లోడ్ చేసిన జాన్వీకి ఇండస్ట్రీ బోణీ కొట్టకుండానే బోలెడంతా పాపులారిటీ వచ్చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sridevi  Daughter  Jhanvi  boyfriend  Shikhar Pahariya  

Other Articles