పవన్ చేతిలో కొత్త నోటు.. ఏం చేయబోతున్నాడు? | pawan kalyan watches new 2000 note carefully.

Pawan research on 2000 note

Pawan Kalyan, Pawan Kalyan Katamarayudu, Pawan kalyan New 2000 note, Pawan observe new note, Katamarayudu updates, Katamarayudu movie, Pawan Kalyan research on new notes

Pawan Kalyan seriously observed new 2000 note in Katamarayudu shooting.

పవన్ చేతిలో కొత్త నోటు.. ఏం చేస్తున్నాడు మరీ...

Posted: 11/25/2016 08:03 AM IST
Pawan research on 2000 note

ఇప్పుడు ఎవరి నోట విన్నా కొత్త నోట్ల మాటే. బ్యాంకులకు వెళ్లి కొత్త నోట్లు అందుకున్నవారు... వాటిని మురిపెంగా పర్సుల్లో పెట్టేసుకుంటున్నారు. ముఖ్యంగా రెండు వేల రూపాయల నోటును. దేశంలో ప్రస్తుతం చెలామణిలోకి వచ్చిన ఈ పెద్ద నోటుపై రోజుకో ఆసక్తికర వార్త తెరపైకి వస్తోంది. నకిలీవంటూ, రంగు పోతున్నాయంటూ, తప్పులంటూ ఇలా...

దీంతో నోటు ఇలా చేతిలో పడగానే, దానిని ఎగా దిగా పరిశీలించేస్తున్నారు. ఇదిగో ఇక్కడో ఫోటో చూడండి. పవర్ స్టార్ కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. తన చేతికొచ్చిన రెండు వేల నోటును ఇలా నిశితంగా పరిశీలిస్తున్నాడు. ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగులో బిజీబిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ షూటింగ్ గ్యాప్ లోనే ఇలా రీసెర్చి మొదలుపెట్టాడు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పాజిటివ్ గానే వ్యాఖ్యలు చేసిన పవన్, ఇప్పటివరకు కొత్త నోటును అసలు చూడలేదేమో. అందుకే విరామ సమయంలో పవన్ ఆ నోటును చాలా పరిశీలనగా చూశారు. పాత వంద రూపాయల నోటుతో దాన్ని పోల్చి చూసి.. ఏవేం అంశాలు అందులో ఉన్నాయి, ఏం లేవన్న అంశాలను గమనించి చూసినట్లు కనిపిస్తోంది.

ఇందుకు సంబంధించిన రెండు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తున్నాయి. బహుశా తన నెక్స్ట్ మీటింగ్ లో దీనిపై మాట్లాడేందుకు సిద్ధమౌతున్నాడేమో నంటూ కొందరు, లేదూ కాటమరాయుడులో ఈ అంశంపై సెటైర్ ఉండొచ్చని కొందరు ఇలా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. సాధారణంగా ఆర్బీఐ రూపొందించే కరెన్సీని పరిశీలిస్తే.. రూ.10,20,50,100 నోట్లన్ని విలువ పెరిగిన కొద్ది నోట్ల సైజు కూడా పెరుగుతుంటుంది. కానీ ప్రస్తుతం మార్కెట్లోకి విడుదల చేసిన రూ.2వేల నోటు వెయ్యి నోటు కంటే పరిమాణంలో చిన్నది కావడం విశేషం.

pawan note

pawan note

pawan new 2000 note

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  2000 note  research  

Other Articles