మోదీ నిర్ణయం టాలీవుడ్ కి నిజంగానే దెబ్బనా? పరిష్కారం ఏంటి? | Modi New Currency Decision Really Effect on Tollywood?

New currency effect on tollywood

Tollywood New Currency, New Currency, Big Movies Effect, Old Currency Tollywood Troubles, Tollywood Biggies, Tollywood New Releases, Baahubali 2 IT Raids, Modi Tollywood

How New Currency Effect on Tollywood and Biggies, Experts Gives solution for New Releases.

పాత నోటు పె...ద్ద దెబ్బ

Posted: 11/12/2016 12:50 PM IST
New currency effect on tollywood

ఓవైపు బిగ్ బడ్జెట్ సినిమాలు ఢీలా పడి తీవ్ర నష్టాలు మిగులుస్తున్నప్పటికీ, చిన్న సినిమాల సహకారంతో టాలీవుడ్ కి లాభాల పంట పండుతూనే ఉంది. ఈ యేడాది ఒకటి రెండు ఊహించని పరిణామాలే తప్ప అంత సవ్యంగా సాగిందని టాలీవుడ్ పరిశ్రమ హ్యాపీగా ఫీలయింది. కానీ, ఇంతలో నెత్తిన పిడుగుపడ్డట్లు దేశ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్ ఒక్కసారిగా కుదేలైపోయింది. పాత పెద్ద నోట్లు చెల్లవంటూ వాటి స్థానంలో కొత్తవాటిని తీసుకురావటం, అవి జనాల్లోకి చేరేందుకు టైం పట్టడం, ఇవే కాదు టాలీవుడ్ కి సంబంధించి కోట్లకు కోట్ల డబ్బులు మారే అంశంలో తీవ్ర ప్రతిష్టంబన నెలకొంది. ఈ విషయంలోకి మరింత లోతుగా వెళ్లితే...   

వంద.. ఐదొందల రూపాయల నోట్ల బ్యాన్ దెబ్బ ఫిలిం ఇండస్ట్రీపై బాగానే ఉండబోతుంది. ఇప్పటికే విడుదలకు సిద్ధమైన సినిమాలు వాయిదాలు వేసుకోగా, కాన్ఫిడెన్స్ తో విడుదలైన సినిమాల థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నిన్న రిలీజ్ అయిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇవే కాదు లైన్ లో చిన్న సినిమాలన్నీ(ఇంట్లో దెయ్యం నాకేం భయం, ఎక్కడిపోతావ్ చిన్నవాడా?, ద్వారకా లాంటివి) ఇప్పుడు రిలీజ్ కు వెనకడుగు వేస్తున్నాయి. చిన్న సినిమాల పరిస్థితే ఇలా ఉంటే.. మరి భారీ బడ్జెట్ సినిమాల పరిస్థితి ఏంటి?

ఇప్పట్లో రాంచరణ్ ధృవ తప్ప బిగ్ బడ్జెట్ మూవీ ఏది లేదనే చెప్పాలి. దానికి ఇంకా దాదాపు నెల టైం ఉంది. అయితే ఆలోపు పరిస్థితి మారొచ్చు, లేకపోవచ్చు. అలాంటప్పుడు 70 కోట్లకు పైగా బిజినెస్ చేసిన నిర్మాత పరిస్థితి, డిస్ట్రిబ్యూటర్ల గతి ఏంటి?  సంక్రాంతి సమయంలో వచ్చే సినిమాలన్నీ 50కి తక్కువకానీ, భారీ బడ్జెట్ సినిమాలే. మరి వాటి మీద ప్రభావం పడనుందా? ఇప్పటికే కమిట్ అయిన భారీ ప్రాజెక్టులు, ఇంకా సెట్స్ మీదకు వెళ్లని సినిమాల పరిస్థితి ఏంటి?

బిగ్ బడ్జెట్ అండ్ రెమ్యునరేష్:
పెద్ద సినిమాలకు ఉన్న అసలు సమస్యలు బడ్జెట్ అండ్ రెమ్యునరేషన్. 40 కోట్ల పై నుంచి వందల కోట్లలో సినిమాలు తీసే దర్శకులు ఇప్పుడిప్పుడు తెలుగులోనూ తయారవుతున్నారు. మోదీ నిర్ణయం ప్రకటించాక కంగారుతో వారంతా నల్లడబ్బును బయటికి తెస్తారని, ఆక్రమంలో వారిపై కన్నేసి పట్టుకోవచ్చని ఐటీశాఖలు పెద్ద ఎత్తునే స్కెచ్ వేస్తున్నాయి.  ఈ క్రమంలో బాహుబలి చిత్ర నిర్మాతలపై రైడ్లు చేయటం లాంటి ఘటనలు జరుగుతున్నాయి.

కానీ, సినిమాలనే నమ్ముకుని ఉన్న కొందరు నిర్మాతలు ఉన్నదంతా వాటిపైనే పెట్టి ఉంటారన్న విషయాన్ని తోసిపుచ్చలేం. మరికొందరు మాత్రం యధేచ్ఛగా తమ బ్లాక్ ను వైట్ గా మార్చేందుకు బినామీలతో ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించేశారు కూడా. నిర్మాతల యాంగిల్ లో ఉద్యోగులకు జీతాలను డెయిలీ పేమెంట్ ద్వారా ఇచ్చే సంస్కృతి టాలీవుడ్ లో ఇప్పటికీ ఉంది. ప్రస్తుత నిర్ణయంతో దాని మీద పెను ప్రభావం పడింది.

టాలీవుడ్ టాప్ హీరోల పారితోషికం అంతా రూ.కోట్లలోనే ఉంది. అయితే ఇక్కడ ఓ వాదన ఏంటంటే... డబ్బంతా పూర్తిగా వైట్ లో కాకుండా, సగం సగం రూపంలో తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఓ నిర్మాత ఓ స్టార్ హీరో తన పారితోషికంలో 80 శాతాన్ని బ్లాక్‌మనీగా ఇమ్మన్నాడని స్టేట్ మెంట్ ఇచ్చి పెద్ద కలకలమే రేపాడు. ఈ నేపథ్యంలో వారి పారితోషకాల విషయంలో మున్ముందు కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది.

కొత్త నిబంధనలతో...
హీరోలకు, ఇతర చిత్ర యూనిట్‌ అంతటికీ బ్యాంక్‌ల ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి పన్ను ఎగ్గొట్టడానికి వీల్లేదు. అందువల్ల నిర్మాత ఖచ్చితంగా వైట్ మనీనే ఇచ్చి తీరాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
మరోవైపు కోట్లకు కోట్లు పారితోషకం తీసుకునే హీరోలు కూడా ఖచ్ఛితంగా తమ లెక్కలు బొక్కలు లేకుండా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వాటిలో ఏమైనా తేడాలు వస్తే మాత్రం వారి బండారాలు బయటపడి అసలుకే మోసం వస్తుంది.

ప్రస్తుత పరిస్థితిని బేరీజువేసుకుంటే... కాస్త సర్దుమణిగి ధైర్యం చేసి సినిమాలు రిలీజ్ చేసినా జనాలు కౌంటర్లలో డబ్బులు కట్టి టికెట్లు కొన్నా.. థియేటర్ల జనాలు ఆ అమౌంట్ ని బ్యాంకుల్లో వేసుకోవడానికి ఇబ్బందులున్నాయి. ఇలాంటి సమయంలో రోజూ లక్షల కొద్దీ అమౌంట్స్ అకౌంట్స్ లో వేస్తే.. ఇన్ కం ట్యాక్స్ ఇబ్బందులు తప్పకపోవచ్చు. డిస్ట్రిబ్యూటర్లకు చేయాల్సిన పేమెంట్స్ విషయంలో బాగా డిస్టర్బెన్స్ వచ్చేసే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా తమ వద్ద ఉన్న నల్లధనంను ఏం చేయాలన్న మీమాంసలో ఇప్పుడన్న వారిలో కొందరు ఉన్నారన్నది వాస్తవం

సమస్యకు పరిష్కారం ఇదేనా:
రానున్నది సినిమా నామ సంవత్సరం. ఎందుకంటే టాలీవుడ్ లోనే ఇప్పటిదాకా రానీ భారీ బడ్జెట్ చిత్రాలు వచ్చే ఏడాది అది కూడా మొదటి భాగంలోనే సందడి చేయబోతున్నాయి. మెగాస్టార్ 150 ఖైదీ నంబర్ 150, బాలయ్య శాతకర్ణి, మహేష్ తో మురగదాస్, కొరటాల చిత్రాలు, పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు, బన్నీ డీజే, అన్నింటికీ మించి బాహుబలి-2 ఇవన్నీ కలిపి వెయ్యి కోట్లపైనే బిజినెస్ చేయాల్సిన చిత్రాలు. ఈ దశలో ఆర్థిక పరమైన సమస్యలను నిర్మాతలు సరిగ్గా హ్యాండిల్ చేసుకోవాలని సూచిస్తూ, వాటి రిలీజ్ కు మాత్రం ఓ మార్గం సూచిస్తున్నారు నిపుణులు.

మల్టీప్లెక్సుల్లో మాదిరిగానే.. సింగిల్ స్క్రీన్లలో కూడా టికెటింగ్ వ్యవస్థను ఆన్ లైన్ చేసేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అప్పుడు అమౌంట్ మొత్తం ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ అయిపోతుంది. ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లో ఈ విధానం ఉంది. అక్కడ టికెట్లు కొంటూ ఉండగానే.. కలెక్షన్స్ ఎంతొచ్చాయో తెలిసిపోతుంది. ప్రతీ నిమిషం అప్ డేట్ అయిపోయే వ్యవస్థ ఉంది.

కౌంటర్లలోనే కార్డులతో టికెట్లు కొనేసే వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. అసలు ఈ నగదు సమస్యే ఎవరికీ ఉండదు కదా అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే వాటిపై అవగాహన లేనివారి పరిస్థితి ఏంటని ప్రశ్నిసే... ఇప్పుడున్న పరిస్థితుల్లో  బ్లాక్’ దందాను అరికట్టాలంటే టాలీవుడ్ కి ఇంతకన్నా మరో మార్గం లేదనే సమాధానమిస్తున్నారు. చూద్దాం మరి టాలీవుడ్ పయనం ఎలా ఉండబోతుందో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood 2017  New Currency Effect  

Other Articles