బర్త్ డే స్పెషల్ : జాగర్లమూడి రాధాకృష్ణ గురించి తెలియని విషయాలు | Unknown facts about director Krish

Director krish birthday special

Gautamiputra Satakarni Director, Tollywood Director Radha Krishna Jagarlamudi, Director Krish Birthday Special, Krish Birthday, Krish 39 Birthday, Director Krish Wife, Director Krish Life, Krish Carrier, Director Krish Movies

Tollywood Director Radha Krishna Jagarlamudi aka Krish Birthday special.

హ్యపీ బర్త్ డే అంజనీపుత్ర

Posted: 11/10/2016 11:59 AM IST
Director krish birthday special

దర్శక దిగ్గజాలు విరామం తీసుకుంటున్న సమయంలో కొత్త దర్శకుల తాకిడి టాలీవుడ్ కి ఎక్కువగా జరిగింది. అందులో అంతా ఒక్కసారిగా మాస్ మూస చిత్రాలనే సేఫ్ రూట్ గా ఎంచుకుని స్టార్లకు తగ్గట్టుగానే సినిమాలతో రాణిస్తూ వస్తున్నారు. రాజమౌళి లాంటి అగ్రదర్శకులు సైతం కాస్త సాహసం ప్రదర్శిస్తున్నప్పటికీ, ఎక్కువ శాతం ఎమోషనల్ డ్రామానే పండిస్తూ వస్తున్నారు.

కానీ, సందేశాలిచ్చే సినిమాల్లో సున్నితత్వం కూడా ఓ భాగమేనని చాటి చెబుతూ సక్సెస్ లు అందుకుంటున్నాడు దర్శకుడు క్రిష్. 1977 నవంబర్ 10న గుంటూరులోని వినుకొండలో అంజీపుత్రుడిగా జన్మించాడు రాధాకృష్ణ జాగర్లముడి అలియాస్ క్రిష్.

కొత్తవాడు కావటం, పైగా నాన్ కమర్షియల్ కావటంతో నిర్మాతలు ఎవరూ ధైర్యం చేసి ముందుకు రాని తరుణంలో సొంత వాళ్లతోనే తొలి చిత్రం ‘గమ్యం’ తెరకెక్కించాడు. మొదటి ప్రయత్నంతోనే దర్శకుడిగా తనేంటో నిరూపించుకుని ఓ ముద్ర వేసుకున్న క్రిష్‌ నంది అవార్డు సైతం అందుకున్నాడు కూడా. ‘వేదం’ లాంటి టిపికల్ సబ్జెక్ట్ ను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించి మరో అడుగు పైకెక్కాడు. సోషల్ ఇష్యూను బేస్ చేసుకుని రానాతో ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ అంటూ తెరకెక్కించాడు. అయితే కమర్షియల్ గా ఆకట్టుకోకపోయినా, ఆ చిత్రంకు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఆపై బాలీవుడ్ లో ప్రమోషన్ వచ్చి మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ ను అక్షయ్ కుమార్ తో ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ గా తెరకెక్కించాడు.

గత తన సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే కాదు, సమాజాన్ని, ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేసిన క్రిష్ ఆపై సమాజంలో మనుషుల మధ్య అడ్డుగోడగా ఉన్న కులం అనే జాడ్యాన్ని ‘కంచె’ తో తెంచేశాడు. ఓ సున్నితమైన ప్రేమకథకు రెండో ప్రపంచయుద్ధానికి ముడి పెట్టి అల్లిన ఈ ‘కంచె’ ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. అంతేకాదు పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో విజయవంతంగా కంచె తన సత్తా చాటింది.

ప్రస్తుతం నటసింహ బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వందవ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఇందుకోసం ఇండియాలోనే ప్రథమ యుద్ధ వీరుడు, తెలుగు చక్రవర్తి అయిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కథాంశాన్నే ఎంచుకోవటం పెద్ద గట్స్ అనే చెప్పుకోవాలి.

ఇక రొటీన్‌ కమర్షియల్‌ సినిమాలకు పోకుండా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేస్తున్న క్రిష్‌ ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని తెలుగు విశేష్ కోరుకుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  director krish  Birthday special  

Other Articles