కొరటాల-మహేష్ సినిమా మొదలైంది.. సెంటిమెంట్ కంటిన్యూ | mahesh koratala new movie officially launched

Mahesh koratala new movie launched

Mahesh Koratala new movie, Mahesh Babu Koratala Siva new movie, Mahesh second movie with Koratala, Koratala new movie with Mahesh Babu, mahesh babu koratala movie opening, Srimanthudu combo another launched

After Srimanthudu Mahesh Babu Koratala Siva new Movie Launched.

మహేష్-కొరటాల మూవీ మొదలైంది

Posted: 11/09/2016 03:13 PM IST
Mahesh koratala new movie launched

తెలుగు చలన చిత్ర చరిత్రలో మహేష్ బాబు శ్రీమంతుడు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. బాహుబలి తర్వాత నెల రోజులకే రిలీజ్ అయినప్పటికీ, నాన్ బాహుబలి పేరిట ఉన్న రికార్డులను అలవోకగా తుడిచిపెట్టేసింది. మహేశ్ కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగానే కాదు, సెకండ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఇక తీసిన మూడు సినిమాలు హిట్ కావటం, వాటితో సందేశం కూడా దాగి ఉండటంతో కొరటాలతో మహేష్ మరోసారి జోడి కడతాడని కొంత కాలంగా చెప్పుకుంటున్నారు. ఆ మధ్య కొరటాల కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు కూడా. దీంతో వీరి సినిమా ఎప్పుడూ మొదలౌతుందా? అని అంతా ఆత్రుతగా చూడసాగారు. ఇక తనకి మహేశ్ మరో అవకాశం ఇవ్వడంతో కొరటాల శివ కూడా ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోయాడు.

బుధవారం ఉదయం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. మొదటి రోజు షూటింగ్ సెంటిమెంట్ తో మహేష్ దీనికి హాజరు కాలేదు. దీంతో సూపర్ స్టార్ తరపున భార్య నమత్రా పూజా కార్యక్రమంలో పాల్గొంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి హీరోయిన్ ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు సురేష్ బాబు, దానయ్య హాజయ్యారు. ప్రస్తుతం మహేష్ మురగదాస్ చిత్రంతో బిజీగా ఉండగా, కొరటాల పెన్నును పదును పెట్టి స్క్రిప్ట్ ను పూర్తి చేయబోతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సంక్రాంతి నుంచి ప్రారంభం కానుంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  Koratala siva  second movie  Launched  

Other Articles