చెర్రీ-సుక్కూ టైటిల్ చిత్రాతి చిత్రం | Ram Charan Sukumar movie title changed

Ram charan sukumar movie title changed

Ram Charan Sukumar movie, Ram Charan Sukumar movie official title, Formula X title, Facebook Chat at 8 PM title, Cherry-Sukku movie title, Ram Charan Sukku Movie, Ram Charan Sukumar title fake

Ram Charan Sukumar movie title changed. Formula X renamed as Facebook Chat at 8 PM, But not Confirmed yet officially.

ఫార్ములా ఎక్స్ మొత్తం మార్చేశాడా?

Posted: 11/08/2016 10:32 AM IST
Ram charan sukumar movie title changed

ఒక పక్క రాంచరణ్ ధ్రువ రిలీజ్ కు సిద్ధమైపోతుండగా, మరోపక్క సుకుమార్ తో తీయబోయే సినిమా గురించి అంతా చర్చలు మొదలౌతున్నాయి. హీరోల బాడీ లాంగ్వేజ్ ను భయంకరంగా మార్చేసి వారిలో మరో కోణాన్ని చూపి, నటనను పిండుకునే సుక్కూ చేతిలో పడటం మూలానా మెగా పవర్ స్టార్ మరో మెట్టు పైకి ఎక్కుతాడనే అంచనాలో అభిమానులు ఉన్నారు.

నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ తీయబోయే ఈ సబ్జెక్ట్ కోసం భారీ కసరత్తులే జరుగుతున్నాయంట. తొలుత ఫార్ములా ఎక్స్ అంటూ పోస్టర్లు రిలీజ్ అయినప్పటికీ, ఇప్పుడు మరో టైటిల్ పేరు వార్తలోకి వినిపిస్తోంది. ఫేస్ బుక్ లైవ్ ఛాట్ ఎట్ 8 పీఎం’ అంటూ చెర్రీ 11వ చిత్రానికి టైటిల్ ఫిక్సయ్యిందంటూ ఇప్పటికే కొన్ని వార్తలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ప్రేమ కథ అని సుక్కూ లీక్ ఇవ్వటంతో ఫేస్ బుక్ పరిచయం ద్వారా ఇదంతా నడుస్తుందని చెబుతున్నారు.

అయితే పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే కథ అని, పైగా పిరియాడికల్ టచ్ ఉంటుందని చెప్పటంతో ఈ టైటిల్ పై అనుమానాలు నెలకొంటున్నాయి. ఏది ఏమైనా డిసెంబర్ లో సినిమా పట్టాలెక్కితే తప్ప ఈ విషయంలో ఓ స్పష్టత రాదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, రాశిఖన్నా హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Sukumar Movie  Facebook Chat at 8 PM title  

Other Articles