ట్వట్టర్ లో బాలయ్య.. దబ్బిడి దిబ్బిడే... | Balayya joins in twitter account.

Actor balayya joins in twitter

Balayya twitter, Balayya in social media, Balayya twitter followers, Nandamuri fans in Balayya twitter, Bala Krishna Twitter, Balayya twitter trending

Hero Bala Krishna opens twitter account for Satakarni promotion.

బాలయ్య అభిమానులకు గ్రేట్ న్యూస్

Posted: 11/04/2016 02:46 PM IST
Actor balayya joins in twitter

ప్రస్తుతం నడుస్తున్న సోషల్ మీడియా ట్రెండ్ ను సెలబ్రిటీలు వాడుకున్నంతగా సాధారణ జనాలు వాడలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ల అవసరం అలాంటిది కాబట్టి. పబ్లిసిటీ మాధ్యమాలుగా మారిపోతున్న వీటిని జనరేషన్ తేడా లేకుండా హీరోహీరోయిన్లంతా ఫాలో అయిపోవటం, అందులో అభిమానులతో ఇంటరాక్ట్ కావటం లాంటివి చేస్తున్నారు. ఈ లిస్ట్ లోకి త్వరలో మరో టాలీవుడ్ సీనియర్ హీరో కూడా చేరిపోబోతున్నారంట.

ఇప్పటికే ఫేస్ బుక్ లో యాక్టివ్ గా ఉన్న నట సింహ బాలయ్య, తన ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ప్రమోషన్ కోసం ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయబోతున్నాడని సమాచారం. క్రిష్ తోపాటు నిర్మాతలు కోరటం, దానికి పాజటివ్ గా స్పందించిన బాలయ్య అందుకు సిద్ధం అవుతున్నాడని వినికిడి.

ఇక బాలయ్య ట్విట్టర్ ఆరంగ్రేటం తెలిసిన నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున్న సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మరోవైపు మేకర్స్ కూడా బాలయ్యకున్న అశేష అభిమాన గణం మూలంగా చిత్ర ప్రమోషన్ కి బాలయ్య పిట్టకూతలు సాయం చేస్తాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగిలింది దబ్బిడి దిబ్బిడే...

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bala Krishna  Twitter  Satakarni promotion  

Other Articles