మోదీ పిలిస్తే లేటుగా రియాక్షన్... ఏం చెప్పాడు? | Shah Rukh Khan recites a poem for soldiers on Diwali.

Shah rukh khan recites a poem for soldiers on diwali

Shah Rukh Khan recites a poem for soldiers, Shah Rukh Khan recites a poem on Diwali, SRK, SRK diwali news, SRK latest news, SRK diwali wishesh, SRK poem, Poetic angle in SRK, SRK Modi, SRK #Sandesh2Soldiers

Superstar Shah Rukh Khan has penned and recorded a special message in the form of a poem for the Indian soldiers, as a way to support Prime Minister Narendra Modi's #Sandesh2Soldiers initiative.

మోదీ పిలిస్తే ఆలస్యంగా స్పందించాడు

Posted: 11/01/2016 08:31 AM IST
Shah rukh khan recites a poem for soldiers on diwali

సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ వీరందరి తర్వాత బాలీవుడ్ బాద్ షా స్పందించాడు. ఎందులో అనుకుంటున్నారా? దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ దీపావళి సైనికులకు అంకితం ఇవ్వాలన్న అంశంపై. ఈ దీపావళిని సైనికులకు అంకితమివ్వాలని, వారికి సందేశం పంపాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ స్పందించాడు.

అయితే ఆలస్యమైన బాద్ షా ఇచ్చిన సందేశం బాగా ఆకట్టుకునేలా ఉంది. సైనికులకు ఓ కవితా సందేశాన్ని పంపాడు. సైనికులకు పంపిన కవితా సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ‘మన పాదాలు తివాచీల మీద. వారి బూట్లు నేలపైన. మన రోజులు ప్రశాంతం. వారికి రోజూ కొత్త సవాళ్లు. మన రాత్రులు ఆహ్లాదకరం. వారి త్యాగాల వల్లే మనం జీవిస్తున్నాం. వారి కష్టం మరుగున పడిపోకూడదు. వారు పోరాటం చేస్తున్నారు. అందుకే దేశం ఎదుగుతోంది. త్రివర్ణ పతాకం ఎగురుతోంది’ అంటూ షారూఖ్ రాసిన కవిత ఆకట్టుకుంటోంది.

 

సైనికులకు దీపావళి శుభాకాంక్షలు పంపాలన్న మోదీ సందేశ్ టూ సోల్జర్స్ యాష్ ట్యాగ్ పిలుపుతో దీన్ని రాసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  #Sandesh2Soldiers  SRK  poem  

Other Articles