హీరో ఇచ్చిన భయంకర గిప్ట్ తో ఏడ్చిన శిల్పాశెట్టి | Ajay Devgn cockroach prank on Shilpa Shetty

Ajay devgn cockroach prank on shilpa shetty

Ajay Devgn cockroach prank on Shilpa, Shilpa Shetty fears with Ajay Devagan Gift, When Shilpa Shetty cries with Gift, Shilpa Shetty fears at Super Dancer Show, Shilpa Shetty Coacoroaches

Ajay Devgn cockroach prank on Shilpa Shetty at Super Dancer Dance Show.

హీరో ఇచ్చిన గిప్ట్ తో హడలి చచ్చిన నటి

Posted: 10/06/2016 04:09 PM IST
Ajay devgn cockroach prank on shilpa shetty

బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టిని గిప్ట్ ఇచ్చి బయపెట్టాడు హీరో అజయ్ దేవగన్. ప్రముఖ ఛానెల్ లో సోనీలో వస్తున్న సూపర్ డాన్సర్ షో కార్యక్రమంలో జడ్జిగా శిల్పా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. దీనికి శివాయ్ సినిమా ప్రమోషన్ కోసం హాజరయ్యాడు అజయ్ దేవగన్. ఈ సందర్భంగా జడ్జిలుగా ఉన్న డాన్సర్ గీతా కపూర్, డైరక్టర్ అనురాగ్ బసులతోపాటు శిల్పాశెట్టికి గిప్ట్ లు బహుకరించాడు. తనకు అందిన బాక్స్ ను ఓపెన్ చూసిన శిల్పకు చుక్కలు కనిపించాయి.

బొద్దింకలతో నిండిన ఆ బాక్స్ ను చూడగానే ఆమె నోట మాట రాలేదు. బొమ్మలా అలాగే నిలుచుని ఉండిపోయి, కాసేపటికి వణికుతూ గట్టిగా అరిచింది. ఆమె భయం చూసి అక్కడున్న ఆడియన్స్ అంతా పిచ్చ పిచ్చగా నవ్వుకున్నారు. కాసేటికి అవి బొమ్మ బొద్దింకలు అని చెప్పటంతో కుదుటపడిన శిల్ప కార్యక్రమం ను పూర్తి చేసింది. మరోవైపు పెయింటర్ అనుమల్హోత్రా షోకి హాజరైన శిల్పాశెట్టి తనకు ఆర్ట్ అంటే ఎంతో ప్రాణమని, బెస్ట్ ఫ్రెండ్ అయిన సల్మాన్ తనకు ఓ గణపతి బొమ్మను గిప్ట్ గా బహుకరించాడని చెబుతూ, అజయ్ ఉదంతాన్ని కూడా ప్రస్తావించి మరోసారి ఆ ఎక్స్ పీరియన్స్ ని పంచుకుంది.

ఇక అజయ్ దేవగణ్ స్వీయంగా కథ, నిర్మాణం, సంగీతం, దర్శకత్వం అన్ని తానే చూసుకున్నాడు. ఈ నెల 28న శివాయ్ రిలీజ్ కానుంది. పాక్ నటుల మద్ధతు వ్యవహారంతో ఆయే దిల్ ముష్కిల్ సినిమాను రిలీజ్ కానియమంటూ కొన్ని సంఘాలు నిర్ణయించుకున్న నేపథ్యంలో, తమ సినిమాలో పాక్ నటులు ఉన్న వార్తలను అజయ్ దేవగణ్ ఖండించాడు. ఈ మేరకు తన సినిమాలో పాక్ నటులు లేరంటూ ఓ ప్రకటన విడుదల చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shilpa Shetty  Ajay Devagan  Prank  Cockroaches  

Other Articles