రెండేళ్ల నుంచి విడుదల కాలేదు... ఇప్పుడేం చేస్తారు? | Nara Rohit Shankara again get release date

Nara rohit shankara again get release date

Nara Rohit Shankara again get release date, Nara Rahit Shankara use Jyo Craze, Nara Rohit Shankara hits screen, Nara Rohit Shankara

Nara Rohit Shankara again get release date. Producers announced on October 21st.

ఒక్క సినిమాను ఎన్నిసార్లు రిలీజ్ చేస్తారు?

Posted: 10/04/2016 04:58 PM IST
Nara rohit shankara again get release date

కొన్ని సినిమాలు సెట్స్ పైకి వెళ్లకముందే కనుమరుగు అయిపోతే, కొన్ని సినిమాలు షూటింగ్ అంతా పూర్తయ్యాక కూడా విడుదలకు నోచుకోవు. అప్పట్లో నాని నటించిన పైసా, నాగ చైతన్య ఆటోనగర్ సూర్య చిత్రాలు పలు సమస్యలతో ఇలా రిలీజ్ కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది.  ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఓ చిత్రం అలాగే ఆగిపోగా, ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు.

నారా రోహిత్ నటించిన శంకర చిత్రం రెండే్ళ్ల క్రితం విడుదల కావాల్సిన ఈ సినిమా ఇంతదాకా అది గతీ లేదు. తమిళ్ లో మురగదాస్ కథ అందించిన మౌనగురు సినిమా సూపర్ హిట్ కావటంతో (హిందీలో హీరోయిన్ ఓరియంటల్ గా మార్చి సోనాక్షితో అకీరాగా తీశాడు) దానిని అప్పుడే శంకరగా తెలుగులో తెరకెక్కించారు. రెజీనా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకుడు. పాటలు మార్కెట్ లోకి రిలీజ్ అయి కూడా రెండేళ్లయ్యింది. ఈ మధ్య నారా రోహిత్ నటించిన జ్యో అచ్యుతానంద హిట్ కావటంతో ఇదే ఊపని భావిస్తున్న శంకర నిర్మాతలు సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేశారు.

నిజానికి ఈ మధ్యే రెండు సార్లు సినిమా రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసి, చివరకు పోస్ట్ పోన్ చేశారు. చివరకు అక్టోబర్ 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక జ్యో అచ్యుతానంద... లో నటించిన మరోహీరో నాగశౌర్య మూడేళ్ల క్రితం ప్రాజెక్టు ‘నీ జతలేక’ అనే సినిమా అపసోపాల మధ్య మొన్నే రిలీజ్ అయి, ఇలా వచ్చి అలా పోయింది కూడా. అయితే ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉన్నప్పటికీ, అప్పటి సినిమాను ఇప్పుడు ఎక్కించుకోవటం కొంచెం అనుమానంగానే కనిపిస్తోంది. చూద్దాం... అసలు ఈసారైనా సినిమా రిలీజ్ కు నోచుకుంటుందా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohit  Shankara Movie  October 21st  Release  

Other Articles