ధోనీ సినిమా పరమ బోరింగా ఉందా? | Dhoni The Untold Story online review

Dhoni the untold story online review

Dhoni movie review, Dhoni The Untold Story online review, Dhoni movie pre review, MS Dhoni Biopic, Dhoni Biopic review

Dhoni The Untold Story online review says Pictured well but Boring.

ధోనీ సినిమా టాక్ ఎలా ఉందంటే...

Posted: 09/30/2016 10:48 AM IST
Dhoni the untold story online review

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంకా క్రికెట్ నుంచి రిటైర్డ్ కాకుముందే సినిమా రూపంలో జీవిత కథను తెరపైకి ఆవిష్కరించేసుకున్నాడు. బేబీ, స్పెషల్ చబ్బీస్, చిత్రాల దర్శకుడు నీరజ్ పాండే దర్శకుడు. క్రికెటర్ గా ధోనీ క్రియేట్ చేసిన వండర్స్ ను, సారథిగా దేశానికి అతను అందించిన విజయాల గురించి అందరికీ తెలిసిందే. అయితే  అంతకు ముందు అతని జీవితం ఎలా ఉండేది అన్న కోణాన్ని సృశిస్తూ నీరజ్ ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ పేరుతో తెరకెక్కించాడు.

ఈ రోజే రిలీజైన ఈ సినిమా టాక్ ఎలా ఉందో ఓ సారి పరిశీలిస్తే... ఫస్టాప్ ను డీసెంట్ గా, ఎంగేజ్ గా నడిపిన దర్శకుడు సెకండాఫ్ లో మాత్రం కాస్త బోర్ కొట్టిస్తాడంట. ముఖ్యంగా సినిమా లో ఎక్కువ సేపు క్రికెట్ గురించే ఉండటం మైనస్ అవ్వొచ్చని అంటున్నారు. సినిమా లెంగ్తీగా ఉన్నప్పటికీ, లవ్ స్టోరీ కూడా కొంచెం బోర్ కొట్టించినప్పటికీ, వీఎఫ్ఎక్స్ మాత్రం ఆకట్టుకుంటాయంట. ఇక పాత్రల్లో సుశాంత్ ధోనీని మరిపించాడని అంటున్నారు. అచ్చం ధోనీ బయట, మైదానంలో ఎలా ఉంటాడో ఆ బాడీ లాంగ్వేజ్ ని అవపోసన పట్టేసి చేసినట్లు టాక్. ఇక అద్వానీ కైరా పాత్ర బాగా కుదిరిందని అనుకుంటున్నారు. టోటల్ గా సినిమా బాగా వచ్చినప్పటికీ 3గంటల నిడివితో పరమ బోరింగ్ గా ఉందని చెబుతున్నారు.

ఇది సోషల్ మీడియాలోని అభిప్రాయాలు మాత్రమే. పూర్తి రివ్యూ కోసం కాస్త వెయిట్ చేయాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni Biopic  Dhoni The Untold Story  online review  

Other Articles