Dharma Durai producer lodges complaint against Tamanna

Dharma durai producer lodges complaint against tamanna

Dharma Durai producer lodges complaint against Tamannaah, Dharma Durai Abhinetri, Dharma Durai Devi, Dharma Durai producer Suresh Tamanna, Dharma Durai producer complaint, unprofessional behaviour Tamanna, Tamanna legal trouble, Tamanna in Abhinetri promotions

Dharma Durai producer lodges complaint against Tamannaah Bhatia.

మిల్కీ బిహేవియర్ పై ఫిర్యాదు చేశాడు

Posted: 09/30/2016 09:39 AM IST
Dharma durai producer lodges complaint against tamanna

మిల్కీ బ్యూటీ తమన్నాకు ఇప్పుడు అనుకోని చిక్కులు వచ్చిపడుతున్నాయి. అభినేత్రి చిత్రం ప్రమోషన్ లో పాల్గొనటం ఆమెను ఇబ్బందులో నెట్టివేసింది. సాధారణంగా ఓ చిత్రం కోసం ఒప్పందం చేసుకునే సమయంలోనే పూర్తి టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఓకే చెబితేనే సంతకం చేస్తారు. కొందరు స్టార్లు తమ వెసులుబాటును బట్టి చిత్ర ప్రచార బాధ్యతల నుంచి తప్పుకుంటుంటారు. ఇప్పుడున్న సౌత్ స్టార్లలో అజిత్, నయనతార లాంటి వారు మాత్రం ప్రమోషన్ లో పాల్గొనమని ముందే చెప్పేస్తుంటారు. అందువల్ల వారు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోన్న మాట.

అయితే తమన్నా ఓ చిత్రానికి ప్రమోషన్ ఎగ్గొటి మరో చిత్రానికి హాజరు అవుతుండంపై గరం అయిన ఓ నిర్మాత చిత్ర మండలిలో ఫిర్యాదు చేశాడంట. తమన్నా విజయ్ సేతుపతితో ధర్మదురై అనే చిత్రంలో నటించింది. మంచి అంచనాలతో ఆగష్టులో వచ్చిన ఈ చిత్రం ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది . చేసుకున్న ఒప్పందం ప్రకారం తమన్నా ఆ చిత్ర ప్రమోషన్ లో ఎక్కడా కనిపించలేదు. ఇక ఈ మధ్య మాత్రం తమిళ్ చిత్రం దేవి(తెలుగులో అభినేత్రి, హిందీలో టుటుక్ టుటుక్ టూటియా) ఇలా మూడు భాషల ప్రచార కార్యక్రమంలో మాత్రం నిర్విరామంగా పాల్గొంటోంది. దీంతో కాలిన సదరు నిర్మాత సురేష్ వెంటనే నడిగర్ లో ఫిర్యాదు చేశాడు.

అయితే ప్రస్తుతం తనతో కత్తిసందై అనే చిత్రంలో నటిస్తున్న తమ్మూపై నడిగర్ సంఘ కార్యదర్శి అయిన హీరో విశాల్ చర్యలు తీసుకుంటాడా? అన్న డిస్కషన్ జరుగుతోంది. కాగా, గతంలో త్రిష కూడా ఇదే రీతిలో నాయకి(తమిళ్ లో నాయగి) ప్రమోషన్ లో పాల్గొనలేదనే విమర్శలతో అభాసుపాలు అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamanna  Dharma Durai  producer  

Other Articles