సినిమా చూపిస్తానంటున్న మద్దాలి శివారెడ్డి | Race Gurram Villian Ravikishan starts production house

Race gurram villian starts production house

Bhojpuri Star Hero Production House, Bunny Villian Production House, B Granade Entertainments, Ravikishan starts Production House, Maddali Sivareddy turns producer

Bhojpuri Star Hero, Race Gurram fame Ravikishan starts production house B Granade Entertainments.

మెగా విలన్ మాస్టర్ ఫ్లాన్ భలే...

Posted: 09/28/2016 05:43 PM IST
Race gurram villian starts production house

ఓ భాషలో టాప్ హీరోగా ఉన్న వ్యక్తి, మరో భాషలో విలన్ గా నటించడం అంటే మాములు విషయం కాదు. పైగా హీరోయిజంను ఓవర్ గా ఎలివేట్ చేసే టాలీవుడ్ లాంటి ఇండస్ట్రీలో అయితే అది ఇంకా పెద్ద మ్యాటరే. కానీ, తనకు అలాంటి సమస్యలు ఇంత వరకు ఎదురు కాలేదు అంటున్నాడు నటుడు రవికిషన్. రేసుగుర్రం, కిక్-2, సుప్రీం, ఒక్క అమ్మాయి తప్ప సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అతను పరిచయమే.

భోజ్ పురిలో సూపర్ స్టార్ అయిన రవికిషన్ పాతికేళ్ల కెరీర్ లో బాలీవుడ్ సహా మొత్తం వందకు పైగా చిత్రాల్లో హీరోగా నటించాడు. ఆపై రేసుగుర్రం సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. అందులో మద్దాలి శివారెడ్డి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఆపై వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. సాధారణంగా టాప్ హీరోల సినిమాల్లో ఎంత పెద్ద స్టార్ అయినా కొత్త వాళ్లకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. కానీ. నాకు మాత్రం హీరోతో సమానంగా పోటీ పడే పాత్ర ఇచ్చారు. ఈ విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి, హీరో అల్లు అర్జున్ కి థాంక్స్ అంటున్నాడు.

47 ఏళ్ల ఈ సీనియర్ నటుడు ప్రస్తుతం బీ గ్రానేడ్ ఎంటర్ టైన్ పేరుతో హిందీ, తెలుగు, తమిళ్, మళయాళంలో చిత్రాలను నిర్మించేందుకు ఓ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాడు. రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఇండీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ విషయాన్ని ప్రకటించిన రవికిషన్ తెలుగులో అవకాశం లభిస్తే... బాలీవుడ్ కన్నా ఉన్నత స్థాయిలో టెక్నాలజీతో చిత్రాలను నిర్మిస్తానంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Race Gurram Villian  Ravikishan  Production House  B Granade Entertainment  

Other Articles