ఎన్టీఆర్ ప్రేమతో కొరటాల ఖాతాలో మరోకటి | NTR gifts costly house to Koratala

Ntr gifts costly house to koratala

Koratala Costly gift, NTR presents Costly gift to Koratala, Costly House to Koratala, NTR surprise gift to Koratala, NTR gifts house to Koratala, After Mahesh NTR did it for Koratala, Costly Gift Director Koratala

After Mahesh's Audi, NTR gifts costly Duplex house to Director Koratala Siva.

కొరటాల ఖాతాలో మరోకటి

Posted: 09/23/2016 03:51 PM IST
Ntr gifts costly house to koratala

టాలీవుడ్ లో కొరటాల శివ టైం నడుస్తోంది. కేవలం యావరేజ్ సబ్జెక్టులను, టాప్ హీరోల ఇమేజ్ కి తగ్గట్లుగా మలిచి ఇండస్ట్రీ రికార్డులను కాలరాసే సినిమాలను అందించాడు. శివ అందించిన మూడింటికి మూడు బ్లాక్ బస్టర్ లు కావటమే కాదు, ఆయా హీరోల ఇమేజ్ లను తారాస్థాయికి తీసుకెళ్లిన చిత్రాలు కావటం విశేషం. తమ కెరీర్లను మలుపు తిప్పే సినిమాలు అందించినందుకు గానూ మురిసిపోయిన ఆయా హీరోలు అందుకు తగ్గట్లుగానే కొరటాలకు బహుమతులు ముట్టజెప్పారు.  

శ్రీమంతుడు హిట్ తర్వాత సుమారు 50 లక్షల విలువైన అడి కారును గిప్ట్ గా కొరటాలకు ఇచ్చాడు మహేష్ బాబు. అంతేకాదు ఆ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు కూడా. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది. దాదాపు దశాబ్దంన్నరగా తనను ఊరిస్తూ వస్తున్న హిట్ ను అందించడమే కాదు, ఏకంగా టాప్ ఫైవ్ లోకి తన చిత్రాన్ని చేర్చినందుకు గానూ ఓ కాస్ట్ లీ గిప్ట్ ఇచ్చేందుకు సిద్ధమైపోయాడు.

దాదాపు కోటి రూపాయల విలువ చేసే డూప్లెక్స్ హౌజ్ ను కొరటాల కోసం సిద్ధం చేయబోతున్నాడని తెలుస్తోంది. హైదరాబాద్ లోనే కాస్ట్ లీ ప్రాంతంలో తానే స్వయంగా ఎంపిక చేసిన ఈ ఇంటిని త్వరలోనే శివకు అందించనున్నాడంట. అయినా ఎన్టీఆర్ కి ఇదేం కొత్త కాదు. తనకు నచ్చితే భోళా శంకరుడిలా వరాలు ఇచ్చేస్తూనే ఉంటాడు. గతంలో నాన్నకు ప్రేమతో సమయంలో అర కోటి విలువ చేసే బెంజి కారును దర్శకుడు సుకుమార్ కి అందజేశాడు. అంతేందుకు ఆ మధ్య జనతా గ్యారేజ్ షూటింగ్ సమయంలోనే కొరటాల టేకింగ్ నచ్చి 20 లక్షల విలువ చేసే కాస్ట్ లీ వాచ్ గిప్ట్ ఇచ్చినట్లు కూడా చెప్పుకున్నారు. ఓవైపు రెమ్యునరేషన్ పరంగానే కాదు, హిట్లతో కాస్ట్ లీ గిప్ట్ లు కొట్టేస్తూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోతున్నాడు కొరటాల. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  Success  Costly Gift  house  Koratala  

Other Articles