టాలీవుడ్ లో మోస్ట్ అవెయింటింగ్ మూవీగా ఉన్న చిరు 150 ఖైదీ నంబర్ 150 కోసం మెగా అభిమానులే కాదు, యావత్ తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కత్తి రీమేక్ అయినప్పటికీ 9 ఏళ్ల తర్వాత చిరును చూస్తున్నామన్న ఆనందం మాత్రం అందరిలో ఉంది. ఇక దీనికి తగ్గట్లే హంగులను అద్దుతున్నాడు వివి వినాయక్. హీరోయిన్ గా కాజల్ నటిస్తుండగా, ఐటెం సాంగ్ కోసం అరేబియన్ గుర్రంలాంటి కేథరిన్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు మరో నటిని గెస్ట్ రోల్ చేయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. శ్రీయా సరన్ ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో కనిపించబోతుందట. అయితే ఈ విషయంపై అధికార సమాచారం లేకపోయినా దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది. ఇక ఖైదీ కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నుంచి ఇటు సాంగ్స్ వరకూ బాస్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడంట. అట్రాక్షన్ కోసం ఓ పంజాబ్ సింగర్ ని పట్టుకొచ్చాడటం దేవీ. జాస్మిన్ శాండ్లాస్ అనే ఈ లేడీ సింగర్ పంజాబీ సాంగ్స్ తో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.
యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో బోలెడంత ఫేమ్ ఉన్న చిన్నది. గతంలో కిక్.. వన్ నైట్ స్టాండ్ వంటి హిందీ చిత్రాలకు కూడా పాటలు పాడింది. ఆమెతో పాట పాడిస్తున్నట్లు చెబుతూ ఆమెతో దిగిన ఓ ఫోటోను షేర్ కూడా చేశాడు రాక్ స్టార్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more